Political News

మహారాష్ట్ర సరే ఆంధ్రప్రదేశ్ మాటేమిటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్  పార్టీని ప్రారంభించి చాలా రోజులైంది. పార్టీ విస్తరణపై వరుస ప్రకటనలు చేసి కూడా చాలా రోజులైంది. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర నుంచి జనం వచ్చి చేరి కూడా నెలలు గడిచాయి. ఇప్పుడు మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్.. అక్కడి నాందేడ్ లో రెండో సారి బహిరంగ సభను నిర్వహించారు. మహారాష్ట్ర పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్ల పోటీ చేస్తుందని  ప్రకటించడం  ద్వారా అక్కడి కార్యకర్తల్లో కేసీఆర్ జోష్ నింపారు.

మహారాష్ట్ర మాట ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో పార్టీ కదలిక లేదన్న టాక్ నడుస్తోంది. తొలుత హడావుడిగా కొందరు వచ్చి చేరారు. తోట చంద్రశేఖర్ ను ఏపీ శాఖాధ్యక్షుడిగా నియమించారు. అమరావతే రాజధాని  అని కూడా తోట ప్రకటించారు. తర్వాత ఒకరిద్దరు బీఆర్ఎస్లోకి మారారు. కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఆ వర్గానికి చెందిన శాంతి కుమారిని నియమించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ మూలాలున్న మహిళ. అయినా ఏపీలో బీఆర్ఎస్ టేకాఫ్ సగంలోనే ఆగిపోయింది.

బీఆర్ఎస్ ఏర్పాటు సందర్భంగా విశాఖ లేదా విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొన్ని రోజుల తర్వాత విజయవాడలోనే సభ ఉంటుందని అన్నారు. ఈ లోపు అడపా దడపా కేసీఆర్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చేవి. అవి విజయవాడలో ఎక్కువ కనిపించేవి. తర్వాతి కాలంలో ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి.

ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ అంత సులభం కాదని కేసీఆర్ అర్థం  చేసుకున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏపీ ప్రజలు బీఆర్ఎస్ ను ఆదరించే అవకాశం లేనట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలుగా ఉండేందుకు ఎవరూ  ఉత్సాహం చూపించడం లేదని అంటున్నారు. ఏపీలో బంధుత్వం ఉన్న తలసాని శ్రీనివాస యాదవ్ చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. కొంతమంది ఏపీ యాదవ సామాజికవర్గం నేతలకు కలుపుకుపోవాలనుకుంటే వాళ్లు ఆసక్తి చూపలేదు. ఎక్కువకాలం ఏపీలో ఉద్యోగం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఎవ్వరినీ ఆకర్షించలేకపోయారు. దానితో ఏపీపై కొంత కాలం  మౌన రాగాలు ఆలాపించాలని కేసీఆర్  డిసైడయ్యారట..

This post was last modified on March 28, 2023 10:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

4 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

4 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

4 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

6 hours ago