చట్టంతో వచ్చిన చిక్కేమంటే.. ఒక్కోసారి కోరలు తీసిన పులిలా ఉంటుంది. మరోసారి కోరలు లేని అదే పులి రంకెలు వేస్తూ.. నానా హడావుడి చేస్తుంది. అయితే.. ఇదంతా ఆడించే వాడిని బట్టి ఉంటుందే తప్పించి.. చట్టానికి కోరలు లేవని ఎలా చెబుతారు? అది అపోహ మాత్రమే అంటూ వ్యాఖ్యానించేవారు లేకపోలేదు. చట్ట ప్రకారం చేయాల్సినవి చాలానే ఉన్నా.. అత్యుత్తమ స్థానాల్లో ఉండే వారి కోసం అవెప్పుడూ చుట్టాల మాదిరే పని చేస్తుంటాయి. తాము కోరుకున్నట్లుగా నడుచుకునే చట్టాలు కొన్ని సందర్భాల్లో అనూహ్య రీతిలో వ్యవహరిస్తుంటాయి.
ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి పేరును దూషించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో రెండేళ్లు జైలుశిక్ష పడిన రాహుల్ గాంధీకి వరుస పెట్టి దెబ్బలు తగులుతున్నాయి. కోర్టు తీర్పు వచ్చి.. ఆ తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా ముప్ఫై రోజుల గడువు కోర్టు ఇచ్చినప్పటికీ.. తీర్పు వచ్చిన రెండు రోజులకే లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయటం తెలిసిందే. దీని మీద విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న వేళ.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతోంది.
తాజాగా ఆయనకు అనూహ్య రీతిలో నోటీసు అందింది. ఎంపీగా అనర్హత వేటు పడిన రాహుల్ ను ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని లోక్ సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు అందజేయటం పెద్ద షాక్ గా చెప్పక తప్పదు. ఒకవైపు రాహుల్ అనర్హత మీదనే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ.. ఆ విషయాన్ని తాము అస్సలు పట్టించుకోవటం లేదన్న రీతిలో.. ఆయన నివాసం ఉంటున్న ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
తాను ఒకసారి టార్గెట్ చేశానంటే.. వారి సంగతి చూసేందుకు అస్సలు తగ్గని ప్రధానమంత్రిగా పేరున్న మోడీ మాష్టారి చలువతోనే ఇదంతా జరుగుతున్నట్లు చెబుతుంటే.. కమలనాథులు మాత్రం చట్టం తన పని తాను చేసుకోకుండా ఎందుకు ఉంటుంది? చట్ట ప్రకారం జరిగే చర్యల్ని నరేంద్ర మోడీఖాతాలో ఎందుకు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో ఏప్రిల్ 22 లోపు బంగ్లాను ఖాళీ చేయాలని పేర్కొన్నారు. ఎంపీగా అనర్హత వేటుపడిన నేపథ్యంలో ఆయన ప్రభుత్వ బంగ్లాలో ఉండేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఎదురుదెబ్బ రాహుల్ ఊహించనిదే కాదు.. ఈ తరహా పరిణామాలు ఆయన్ను మరింత రాటు తేల్చటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈ తరహా దూకుడు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
This post was last modified on March 28, 2023 9:48 am
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…