ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయడమే ఎక్కువ అనే స్థాయి నుంచి విజయం దక్కించుకునే పరిస్థితి కి పార్టీ చేరడం అంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీకి భారీ ఎత్తున ఆక్సిజన్ అందించినట్టుగానే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా.. పార్టీ రంగంలోకి దగింది.
భారీ ఎత్తున ఓట్లు కైవసం చేసుకుని పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో అధినేత చంద్రబాబు కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. అదేవిధంగా జిల్లాల స్థాయిలోనూ నాయకులు.. పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాథ 23 ఓట్లతో విజయం దక్కించుకున్నారు.
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాల్లోనూ వైసీపీ కోల్పోయి.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో అప్పుడు కూడా టీడీపీ సంబరాల్లో మునిగిపోయారు. భారీ ఎత్తున జిల్లాల్లో కార్యకర్తలు టపాసులు కాల్చుకుని.. మిఠాయిలు పంచుకుని ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా.. అత్యంత కీలకమని భావిస్తున్న ఎమ్మెల్యే కోటాలోనూ విజయం దక్కించుకోవడంతో టీడీపీ సంబరాలు అంబరాన్నంటాయి.
This post was last modified on March 23, 2023 8:32 pm
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…