Political News

ఎమ్మెల్సీ ఎన్నిక‌.. వైసీపీలో గుబులు.. టీడీపీలో హుషారు!

రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్షం టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ కీల‌క విష‌యం ఏంటంటే.. టీడీపీ ఓడిపోయినా..వచ్చే ఇబ్బంది లేదు. అలాగ‌ని గెల‌వ‌ద‌ని గ్యారెంటీ కూడా లేదు. ఎటొచ్చీ.. వైసీపీ శిబిరంలోనే గుబులు ప‌ట్టుకుంది. ఇటీవ‌ల గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల్లోనూ పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. వ‌చ్చిన ఎన్నిక కావ‌డంతో ఇక్క‌డ ఏమైనా తేడా కొడితే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. స‌ర్కారును ఓడించే ప్ర‌మాదం ఉంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మ‌రోవైపు ఏడుగురు సభ్యుల్నీ గెలిపించుకునే బలం తమకుందని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో తమ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తుందని టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉన్నందున.. విప్‌ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్‌లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ చర్చనీయాంశమైంది.

వైసీపీ సాంకేతికంగా 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా 7 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. అయితే, ఇటీవల 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అధికార పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎన్నికను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకుంది. అసంతృప్తి ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా పెట్టి క్రాసింగ్ ఓటింగ్ చేస్తారనే అనుమానం ఉన్నవారి లిస్ట్ తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. టీడీపీ సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా.. నైతిక మద్దతు లేనికారణంతో తటపటాయిస్తోంది. ఎందుకంటే.. 23 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురు వైసీపీ శిబిరానికి అండ‌గా నిలిచారు.

ఒక్కొక్క‌రికీ 22 ఓట్లు చాలు!

ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య, ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి జోడించి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులున్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. టీడీపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం లేనప్పటికీ.. అధికార పార్టీ నుంచి ఒక్క ఓటు క్రాస్ అయినా అభ్యర్థి గెలుపు లాంఛనమేన‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on March 23, 2023 9:54 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

6 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

7 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

7 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

11 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

12 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

13 hours ago