“భారత్‌లో ప్రజాస్వామ్యం లేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియా గళానికీ తాళం వేస్తున్నారు. నియంతృత్వ పాలనకు ప్రతీకగా మారింది” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. దాదాపు 20 రోజుల కిందట బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలు.. భారత్ లో ముఖ్యంగా పార్లమెంటులో మంటలు రేపిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై రాహుల్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ దాదాపు వారం రోజులుగా ఎలాంటి కార్యక్రమాలూ జరగకుండా.. పోయింది. కానీ, రాహుల్ మాత్రం క్షమాపణలు చెప్పలేదు.
అయితే.. విశ్వగురువుగా భారత్‌ను ప్రపంచ దేశాల్లో ఆవిష్కరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ వ్యాఖ్యల ఎఫెక్ట్ బాగానే తగిలింది. చైనా పత్రికలు.. రాహుల్ వ్యాఖ్యలను కోట్ చేస్తూ.. ఇటీవల పతాక వార్తలు రాశాయి. నిజానికి బ్రిటన్ మీడియా బీబీసీ.. గుజరాత్ అల్లర్లను కేంద్రంగా చేసుకుని మోడీ పరువు తీసేసిందని.. బీజేపీ సహా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు మరింతగా మోడీ ని ప్రపంచ దేశాల ముందు ఇరుకున పడేశాయి. దీంతో రాహుల్‌తోనే క్షమాపణలు చెప్పించడం ద్వారా.. ఏదో ఒకరకంగా ఈ నష్టం నుంచి బయట పడాలని బీజేపీ ప్రయత్నించింది.
కానీ, రాహుల్ తన పట్టు వీడలేదు. దీంతో ఇప్పుడు బీజేపీ సహా ప్రధాని మోడీ.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని మోడీ గళం వినిపించేలా ప్లాన్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్స 100వ ఎడిసోడ్ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానుంది. ఇందుకోసం బీజేపీ భారీ సన్నాహాలు చేస్తోంది.
పైకి ఏం చెబుతున్నారంటే..
”ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు గ్లోబల్ నేత. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ప్రసారం చేయనున్నాం. మోడీ పనితీరును ప్రపంచ దేశాలన్నీ అభినందిస్తున్నాయి. ప్రజలు ఆయన మాటలను వినాలనుకుంటున్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే మా లక్ష్యం” అని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 100 ప్రాంతాల్లో 100 మంది చొప్పున కూర్చుని ప్రధాని మన్‌కీ బాత్ వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే.. ఈ సారి స్థానిక అంశాలు అంటే దేశీయ అంశాలు కాకుండా..రాహుల్ సహా.. బీబీసీకి కౌంటర్ ఇచ్చే అంశాలు ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తానికీ ఈ ప్లాన్ కోసం.. ప్రధాని మూడు రోజులుగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇది.. వచ్చే ఆదివారం ప్రసారం కానుంది.
This post was last modified on March 23, 2023 7:20 am
దేశీయ పారిశ్రామిక వర్గాల్లో ఇప్పుడో పెద్ద చర్చ నడుస్తోంది హెలికాఫ్టర్ల తయారీలో దిగ్గజ కంపెనీగా కొనసాగుతున్న ఎయిర్ బస్ తన కొత్త…
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…