Political News

టీడీపీకే ఆ మూడు.. రెప‌రెప‌లాడిన తెలుగు దేశం జెండా!

ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు ఇప్పటికే టీడీపీ ఖాతాలో పడగా.. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ సీటు కూడా టీడీపీకే దక్కింది. పశ్చిమ రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి , వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి నువ్వానేనా అన్నట్లు తలపడినా.. చివ‌ర‌కు టీడీపీ అభ్య‌ర్థి విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి దక్కకపోవడంతో రెండు ప్రధాన్యత ఓట్లను లెక్కించారు.

రెండో ప్రాధాన్యత ఓట్లలో టీడీపీకి ఆధిక్యత కొనసాగింది. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 700 ఓట్ల మెజార్టీతో విజ‌యం ద‌క్కించుకు న్నారు. తొలి ప్రధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యాన్ని కనబర్చిన వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి రెండో ప్రాధాన్యత లెక్కింపులో క్రమంగా తగ్గతూ వచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి బయటకు వెళ్లిపోయారు. దీంతో గెలుపుపై అధికారులు ప్ర‌క‌ట‌న చేశారు.

మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు. పోటీలో నిలిచిన 33మంది స్వతంత్రులు, బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకే మెజారిటీ ఓట్లు దక్కాయి. దీంతో ఆయ‌న సునాయాసంగా విజ‌యం ద‌క్కించుకున్నారు. వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయారు.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా ఇందులో 20 వేల 979 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 2 లక్షల 48 వేల 360 ఓట్లు లెక్కించగా… రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి లక్షా 12 వేల 688 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85 వేల423 ఓట్లు వచ్చాయి. ఇక‌, ఆది నుంచి నువ్వా -నేనా అన్న‌ట్టుగా సాగిన ప‌శ్చిమ రాయ‌ల సీమ‌లోనూ.. ఎట్ట‌కేల‌కు టీడీపీ అభ్య‌ర్థి రాం గోపాల్‌ రెడ్డి విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ జెండా మూడు ప్రాంతాల్లోనూ రెప‌రెప‌లాడ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 18, 2023 9:19 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తీన్మార్ మ‌ల్ల‌న్న ఆస్తులు ప్ర‌భుత్వానికి.. సంచ‌ల‌న నిర్ణ‌యం

తీన్మార్ మ‌ల్ల‌న్న‌. నిత్యం మీడియాలో ఉంటూ..త‌న‌దైన శైలిలో గ‌త కేసీఆర్ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింత‌పండు న‌వీన్ గురించి…

1 hour ago

ఆవేశం తెలుగు ఆశలు ఆవిరయ్యాయా

ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…

1 hour ago

అమిత్ షా మౌనంపై ఆశ్చర్యం !

తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…

2 hours ago

తమన్నా రాశిఖన్నా ‘బాక్’ రిపోర్ట్

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్‌మనై 4 మీద కాస్తో కూస్తో…

2 hours ago

వరలక్ష్మి ‘శబరి’ ఎలా ఉంది

తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…

2 hours ago

గెలిస్తే ఎంపీ .. ఓడితే గవర్నర్ !

ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…

2 hours ago