ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపైసర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు ఎన్నికల్లో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారని.. వచ్చిన వార్తలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రధానంగా తిరుపతి, నంద్యాల జిల్లాల్లో పోలింగ్ జరిగిన తీరు, చివరి రెండు గంటల్లో వైసీపీ నేతలు.. విజృంభించిన తీరు పై అనేక కథనాలు వచ్చాయి. నేతలు దౌర్జన్యానికి దిగారని.. దొంగ ఓట్లు వేసుకున్నారని.. ప్రధాన మీడియాల్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఏమా త్రం అర్హత లేని మహిళలను కూడా ఓటుకు పంపిన వైనం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
ఆయా వ్యవహారాలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. ఇంకెందుకు.. పోలింగ్ దండగ.. మీరే గుద్దేసుకునేదానికి! అని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుపతిలో పోలింగ్ బూత్ 229లో వైసీపీ నేతలు కెమెరాలు ఆపివేసి దౌర్జన్యంగా ఓట్లేసుకున్నారని వచ్చిన వార్తలపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అదేవిధంగా బీజేపీ సీపీఐ, సీపీఎం, టీడీపీ అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఏపీఓపై దౌర్జన్యం జరిగిన పాఠశాల పోలింగ్ బూత్ ఎదుట నిరసనకు దిగారు. అఖిలపక్షాల ఆందోళనకు పోటీగా వైసీపీ నేతలు నిరసనకు దిగారు. దీంతో తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక, నంద్యాల జిల్లా ఆత్మకూరు పోలింగ్స్టేషన్ దగ్గర కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల్లో యధేచ్చగా వైసీపీ నేతల సంచారించారు. సమాచారం అందుకున్న.. టీడీపీ నేత బుడ్డా రాజశేఖరరెడ్డి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. గందరగోళంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.
ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరులో టీడీపీ నేత మండ్ర శివానందరెడ్డి ఓటు వేసేందుకు వచ్చారు. అయితే క్యూలైన్లో నిలబడకుండా ఓటు వేసేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను శివానందరెడ్డి నిలదీశారు. దీంతో శివానందరెడ్డి డౌన్ డౌన్ అంటూ వైసీపీ నేతలు గొడవకు దిగారు. ఎన్నికల కేంద్రం బయట టీడీపీ, వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. మొత్తంగా ఈ పరిణామాలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on March 14, 2023 11:02 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…