తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. తర్వాత ఏదో తుఫాను వస్తుందన్నమాటే. గతం లో జరిగిన పరిణామాలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. కేసీఆర్ మౌనం.. చాలా కీలకమనే భావన రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చుట్టుకుంది. ఆమెను కూడా అరెస్టు చేసి.. తీహార్ జైలుకు తరలిస్తారనే చర్చ కూడా సాగుతోంది.
గతంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి ని కూడా అరెస్టు చేసి .. తీహార్ జైలుకే తరలించిన విషయాన్ని ప్రస్తుతం నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నా రు.ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా? జరగదా? అనే టెన్షన్ అయితే కొనసాగుతోంది. మరోవైపు.. కేసీఆర్ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నారు. ఆయన పన్నెత్తు మాట మాట్లాడడం లేదు.
మరి ఇంత ఉద్రిక్తత, భావావేశాలు పొంగుతున్న సమయంలోనూ ఆయన ఎందుకు ఇంతగా మౌనం వహిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. కేంద్రంలోని మోడీ సర్కారు తమను అణిచి వేస్తోందని.. ఆయన తరచు గా చెబుతున్నారు. కానీ,లిక్కర్ విషయాన్ని కానీ, తన కుమార్తెను ఈ కేసులో చేర్చడంపై కానీ ఇప్పటి వర కు ఆయన నోరు విప్పలేదు. దీనికి రీజనేంటి? అంటే.. మోడీ చేస్తున్న తప్పులను ఆయన లెక్కిస్తున్నారని చెబుతున్నారు పరిశీలకులు.
మరో రెండు మాసాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు.. మోడీపై మరింత వేగం గా.. తీవ్రంగా కేసీఆర్ విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్రంలో మోడీని డైల్యూట్ చేసేందుకు.. అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నారని.. అందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు ఏం మాట్టాడినా.. కవిత విచారణపై ప్రభావం పడుతుందని నిమ్మళంగా ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 9, 2023 5:56 pm
భాగ్యనగరి హైదరాబాద్ లో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో జరిగిన ఈ ప్రమాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. భారత గణతంత్ర దినోత్సవాన తన పార్టీ శ్రేణులకు కొత్త మార్గదర్శకాలు…
నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి. బాలయ్య నటించిన సినిమాలన్నీ వరుసబెట్టి హిట్ల మీద…
రాజకీయ నేతలు నిత్యం బిజీ షెడ్యూల్ తో సాగిపోతూ ఉంటారు. ఇక అధికారంలో ఉన్న పార్టీల నేతలైతే.. క్షణం తీరిక…
భారత గణతంత్ర దినోత్సవం నాడు ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ నేతల ఓ కీలక సమావేశం జరిగింది. పార్టీలో క్రియాశీలక…
మూడేళ్ళ క్రితం చిరంజీవి గాడ్ ఫాదర్ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి ప్రధాన కారణం ఒరిజినల్ వెర్షన్ లూసిఫర్ లో…