మరో 10 మాసాల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. మరి ఇప్పుడు ఎన్నిస్థానాల్లో విజయం దక్కించుకోవాలి? ఎన్నిచోట్ల గెలుపుగుర్రం ఎక్కాలి..? ఇదీ.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌లో జరుగుతున్న అంతర్మథనం. గత 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం దక్కించుకుంది. అదే సమయంలో 46.9 శాతం ఓటు బ్యాంకు ను సొంతం చేసుకుంది.
అయితే..అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయాలకు రెడీ అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని మరింత దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వానపాములుగా భావించిన కొన్ని పార్టీలు ఇప్పుడు బుసలు కొడుతున్నాయి. అధికారమే పరమావధిగా దూసుకుపోతున్నాయి.
దీంతో గతంలో ఉన్న ఊపు, గత ఎన్నికల్లో ఉన్న హవా.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు లభించే అవకాశం లేదన్నది ముందస్తుగా వస్తున్న అంచనాలు. ఈ నేపథ్యంలో అలెర్టయిన కేసీఆర్.. గత వారం రోజులుగా ఉన్నతాధికారులు సహా గత ఎన్నికల్లో పనిచేసిన కొందరుకీలక అధికారులతోనూ.. రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో చంద్రబాబు – కాంగ్రెస్ చేతులు కలపడం ద్వారా మరోసారి సెంటిమెంటును రగిల్చారు.
కానీ, ఇప్పుడు జాతీయ పార్టీ కావడంతో ప్రాంతీయ భావాలను ఆయన పక్కన పెట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ.. అదే సెంటిమెంటు తప్ప.. మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు మంత్రులను సెంటిమెంటు దిశగా నడిపిస్తున్నారు. మానీళ్లు.. మా నేల అంటూ.. నిరంజన్ రెడ్డి వంటి మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, 100 స్థానాల్లో గెలిచి నిలవాలనే టార్గెట్ పెట్టుకుని బలంగా పనిచేయాలని తాజాగా ఒక అంచనాకు వచ్చినట్టు ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఏం చేస్తారోచూడాలి.
This post was last modified on March 4, 2023 9:32 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…