ఏపీ సర్కారులో మంత్రులకు మించి.. మరోమాటలో చెప్పాలంటే.. మంత్రి వర్గం కన్నా డబుల్ సంఖ్యలో ఉన్నారనేది అందరికీ తెలి సిందే. దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా.. ప్రస్తుతం 56 నుంచి 62 మంది సలహాదారులు ఉన్నారు. అయితే.. వీరిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తెల్ల ఏనుగులను పోషిస్తున్నారనే కామెంట్లు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఈ సలహాదారుల పరిస్థితి ఏంటంటూ.. హైకోర్టులో అనేక కేసులు కూడా పడ్డాయి. వీటిలో సజ్జల రామకృష్ణారెడ్డిపై సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ దాఖలు చేసిన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
ఈ కేసు విచారణ సమయంలోనే అసలు ఆర్థికపరిస్థితిలో అధమంగా ఉన్న ఏపీకి ఇంత మంది సలహాదారులు అవసరమా? అని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమించేలా ఉన్నారంటూ.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించింది. అయితే.. ఇవన్నీ లెక్కచేసేవారికి. కానీ, ఏపీ ప్రభుత్వం ఏనాడూ.. కోర్టు వ్యాఖ్యలను పట్టించుకోలేదు. దీంతో మళ్లీ మళ్లీ.. సలహాదారులను నియమిస్తూనే ఉన్నారు సీఎం జగన్. హైకోర్టు ఇంత మాట అనేశాక.. నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు.
మరి ఇప్పుడు ఎవరిని?
ఇక, ఇప్పుడు సీఎం జగన్ మరో సలహాదారును నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. వారిసమస్యలు విన్నారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం ను కొనియాడారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి… స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. చర్చిలు, వాటి ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కూడా హామీ ఇచ్చారు. అదేసమయంల ఇకపై క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని తేల్చి చెప్పారు. తద్వారా వారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. సో.. ఇదీ కథ!!
This post was last modified on February 27, 2023 10:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…