వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిలో కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. తన రాజకీయ ప్రత్యర్థులపై ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఆయన ఎలా విరుచుకుపడుతుంటారో.. ఎంతటి దారుణమైన భాష వాడుతుంటారో తెలిసిందే. కానీ కొంత కాలంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ గమనిస్తే పరుషమైన విమర్శ ఒక్కటీ లేదు. అదే సమయంలో వైకాపాలో ఆయన ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. అందులోనూ ఇటీవల తారకరత్న అనారోగ్యం పాలైనపుడు.. తర్వాత అతను మరణించినపుడు తనకు దగ్గరి బంధువైన సాయిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.
ఓవైపు తారకరత్న విషయంలో వైకాపా వాళ్లంతా దారుణమైన దుష్ప్రచారాలు చేస్తుంటే.. సాయిరెడ్డి మాత్రం బాలయ్యను పొగిడారు. తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఈ పరిణామాలు వైకాపా అధినేత, సీఎం జగన్‌కు ఏమాత్రం రుచించేవి కావని.. సాయిరెడ్డికి పంచ్ పడటం ఖాయమని అనుకున్నారు చాలామంది.
ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇప్పటికే పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యం బాగా తగ్గిపోగా.. ఇప్పుడు ఆయన్ని దాదాపుగా జీరోను చేసేశారు.
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్‌ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు వైకాపా నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది.అందులో వివిధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించింది. దీని సంబంధించి మీడియాకు విడుదల చేసేన ప్రకటనలో ఈ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పేర్కొనడం గమనార్హం.
ఇంతకుముందు ఇదే పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉండేవారు. కానీ ఇప్పుడు సాయిరెడ్డిని పక్కకు తప్పించి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ పదవి నుంచి సాయరెడ్డిని పక్కన పెట్టడం అంటే ఆయన పూర్తిగా జగన్ విశ్వాసం కోల్పోయినట్లే కనిపిస్తోంది.
This post was last modified on February 26, 2023 2:22 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…