సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ పేరుకు ఇప్పుడు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెల్లారిలేస్తే.. ఆయన పాత్ర ప్రభుత్వంలోనూ.. పార్టీలోనూ కీలకంగా మారిపోయింది. ముఖ్యమంత్రి తర్వాత.. ముఖ్యమంత్రి ఆయనేన ని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అలాంటి సజ్జల ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో కానీ, పరోక్ష రాజకీ యాల్లో కానీ లేరు. అంటే. ఆయన ప్రజల నుంచి ఎన్నిక కాబడలేదు. పోనీ.. నామినేట్ అయి పరోక్షంగా .. మండలిలోనో.. రాజ్యసభలోనో కీలకంగా కూడా లేరు.
అయినప్పటికీ.. సీఎం జగన్ సర్వాధికారాలు కూడా సజ్జలకు అప్పగించారని.. ఆయన సొంత పార్టీ నాయ కులు గుసగుసలాడితే.. ప్రధాన ప్రతిపక్షాలు బహిరంగ విమర్శలే చేస్తున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ రాజకీయ సలహాదారుగా మాత్రమే సజ్జల ఉన్నప్పటికీ.. అన్ని విషయాలు ఆయనే చూస్తున్నారు. ఇదిలా వుంటే.. వచ్చే ఎన్నికల్లో సజ్జల రామకృష్ణారెడ్డి వారసుడు.. భార్గవ రెడ్డి కూడా వైసీపీలో ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు.
వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఆయన ఇంచార్జ్‌గా ఉన్నారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో సజ్జల భార్గవ రెడ్డిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపాలని చూస్తున్నట్టు పెద్ద ఎత్తున వైసీపీలో టాక్ నడుస్తోంది. అసెంబ్లీకి కానీ.. పార్లమెంటుకు కానీ.. భార్గవను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అసెంబ్లీకి అయితే.. రాజంపేట(ఉమ్మడి కడప జిల్లా) నుంచి పరిశీలించే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడి మేడా మల్లికార్జున రెడ్డి వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి తప్పుకొంటున్నట్టు సంకేతాలు ఇచ్చారు.
రాజంపేట కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయించలేకపోయారనే ఆగ్రహం మేడాపై ఇక్కడి ప్రజల్లో బలంగా ఉంది. దీంతో వైసీపీ తరఫున తాను పోటీ చేస్తే.. ఓటమి ఖాయమని గుర్తించిన ఆయన కుదిరితే టీడీపీ (గతంలోనూ ఈ పార్టీలో గెలిచారు) లేకపోతే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో రాజంపేట నుంచి భార్గవరెడ్డిని నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ కుదరకపోతే.. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి భార్గవరెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. ఏదేమైనా. సజ్జల వారసుడి ఎంట్రీ మాత్రం ఖాయమనే అంటున్నారు.
This post was last modified on February 24, 2023 9:46 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…