ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో వాలం టరీ రిటైర్మెంట్ ప్రకటించిన జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్‌గా నియమితులయ్యారు. అయితే . ఈయన స్టయిల్ వేరని.. ఈయన గురించి తెలిసిన న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆయన ఎక్కువగా ఆడంబరాలకు పోరు. ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటారు. పైగా.. కష్టపడి పనిచేసి.. సంపాయించుకో వాలనే తత్వం ఉన్న వారట.
దీనికి కొన్ని ఉదాహరణలు కూడా న్యాయనిపుణులు చెబుతున్నారు. జస్టిస్ నజీర్‌కు సొంతగా కారు ఉంది. దీనినే ఆయన న్యాయమూర్తిగా ఉన్నన్నాళ్లు వినియోగించారట. ప్రభుత్వం వాస్తవానికి సుప్రీం న్యాయమూ ర్తులకుకొత్త కొత్త కార్లు ఇస్తుంది. కానీ..జస్టిస్ నజీర్ మాత్రం ప్రభుత్వానికి భారం ఎందుకని.. తనకు ఆ మా త్రం స్థాయి ఉందని.. ఆయన తన సొంత కారునే వినియోగించేవారట. ఇక, ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా చాలా చాలా తక్కువగా వినియోగించేవారు.
సుప్రీం కోర్టులో ఒక్కొక్క న్యాయమూర్తికి నలుగురేసి చొప్పున వ్యక్తిగత సిబ్బందిని ఇస్తారు. జస్టిస్ నజీర్ మాత్రం ఇద్దరినే వినియోగించుకునేవారు. మిగిలిన ఇద్దరినీ ప్రభుత్వానికి సరెండర్ చేశారనిన్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. విదేశీ, స్వదేశీ పర్యటనలు చేసేందుకు కేంద్రం న్యాయమూర్తుల కు నిధులు ఇస్తుంది. దీంతో వారు సమ్మర్ హాలీడేస్‌కు విదేశాలకు వెళ్తుంటారు.
కానీ, జస్టిస్ నజీర్ మాత్రం ఎప్పుడూ.. విదేశాలకు వెళ్లలేదు. అంతేకాదు.. ఆయనకు అసలు పాస్ పోర్టు కూడా లేదు. ఇటీవల కేంద్రమే బలవంతం చేసి.. పాస్‌పోర్టు ఇప్పించిందట. అదికూడా అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితిలో! ఈ మొత్తం ఎపిసోడ్‌లో అర్థమైంది.. ఏంటంటే జస్టిస్ నజీర్ చాలా చాలా మితభాషి మాత్రమే కాదు.. ఖర్చులు కూడా తగ్గించుకునే రకం. అంతేకాదు.. కష్టపడి పనిచేయాలనే తత్వం ఉన్నవారు.
మరి అలాంటి గవర్నర్ వచ్చినందకు హ్యాపీనే కానీ.. ఏపీ ప్రభుత్వానికి ఆయనకు పడుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే..ఏపీలో అనేక సంక్షమ పథకాల ద్వారా.. ప్రజాధనాన్ని ఉచితాలకు పంచుతున్నారనే వాదన ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. అనేక వేల కోట్లను ప్రజలు ఉచితాల కింద ఇచ్చామని.. జగనే చెబుతున్నారు. ఈ ఉచితాలు గిట్టని వ్యక్తి గవర్నర్‌గా వచ్చిన నేపథ్యంలో జగన్ దూకుడుకు బ్రేకులేమైనా పడతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on February 24, 2023 9:43 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…