వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ పీటముడులు మరిన్ని పెరుగుతున్నాయి. తాజాగా పరిణామాలు.. ఆయనను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు తనపై ఓ వర్గం మీడియా దాడి చేస్తోందని చెబుతూ వచ్చిన అవినాష్.. ఇప్పుడు సీబీఐ లాగుతున్న కూపీలు.. సేకరిస్తున్న ఆధారాలతో ఊబిలో దిగిపోతున్నారనే వాదన వైసీపీలోనే వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటి వరకు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో పెదవి విప్పని వ్యక్తి అవినాష్ రెడ్డి ఒక్కరే. ఆయన ఎక్కడా కూడా ఎంత వత్తిడి వచ్చినా.. పెదవి విప్పలేదు. అయితే.. ఇప్పుడు సీబీఐ వేళ్ల న్నీ.. దృష్టంతా కూడా.. కడప ఎంపీ సీటు.. అనంతర పరిణామాలు.. షర్మిల ఇచ్చిన వాంగ్మూలం వంటి వాటి చుట్టూ తిరుగుతూ..వచ్చి వచ్చి అవినాష్ దగ్గర ఆగినట్టు మీడియా పేర్కొంది.
ఇక, ఇదే నిజమైతే.. సీబీఐ ఇప్పుడు విచారించనున్న నేపథ్యంలో అవినాష్‌ను అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అంత తేలిక విషయం కాదు. వైఎస్ కుటుంబంలో.. ముఖ్యుడిగా..పైగా సీఎం జగన్ తన తమ్ముడు అని సాక్షాత్తూ అసెంబ్లీలోనే పేర్కొన్న నాయకుడిగా.. ఉన్న అవినాష్.. ఈ కేసులో అరెస్టయితే.. మొత్తానికే డ్యామేజీ అవుతుంది. వచ్చే ఎన్నికలపైనా అది ప్రభావం చూపిస్తుంది.
అందుకే.. గతంలో జగన్ చెప్పినట్టుగా.. అవినాష్ ఈ కేసుముడులు పెరుగుతున్న కొద్దీ.. తన రాజకీయాల ను కూడా మార్చుకునే పరిస్థితి ఉందని కడప పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎలానూ.. ఇలాంటి నాయకులకు ఆపన్న హస్తం అందించేందుకు బీజేపీ రెడీగా ఉంటుందని కూడా కడప నాయకులు చెబుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలు.. తర్వాత.. వారు బీజేపీలో చేరాక చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే.. అవినాష్‌కు సేఫ్ పార్టీ ఇప్పుడు బీజేపీనేననే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 23, 2023 12:06 pm
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…
సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…