Political News

మోడీ గెలిచారు.. ప్ర‌జ‌లు ఓడారు.. కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అంటే చాలు.. మండిప‌డుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, అవ‌కాశం ద‌క్కితే చాలు విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా అసెంబ్లీ వేదిక‌గా కేసీఆర్‌.. మోడీపై విరుచుకుప‌డ్డారు. సుమారు గంటా 20 నిమిషాల పాటు మాట్లాడిన కేసీఆర్‌.. ప్ర‌తి విష‌యంలోనూ మోడీని టార్గెట్ చేశారు. కేసీఆర్ వ్యాఖ్య‌ల్లో కీల‌క‌మైనవి చూస్తే.. మోడీ గెలిచారు.. కానీ, ప్ర‌జ‌లు ఓడారు.. అనే కామెంట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతోంది. ఇంకా ఏమ‌న్నారంటే..

  • దేశంలో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని, 75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా అదే పరిస్థితి ఉందని దీనిపై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉంది.
  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. కాలేజీల విషయంలోనూ తీవ్ర అన్యాయం చేశారు. దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇదేనా స‌మాఖ్య వ్యవస్థ?
  • తెలంగాణ‌కు రావాల్సిన రూ.495 కోట్లు ఏపీకి ఇచ్చారు. 7 ఏళ్లుగా అడుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. గతంలో ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సీఎంగా ఉన్న‌ తెలంగాణ జిల్లాల‌కు ఒక్క పైసా కూడా ఇవ్వమన్నారు.
  • ఢిల్లీలో తాగునీరు లేదు. ప్ర‌ధాని మోడీ మాటలు కోటలు దాటుతున్నాయిజ‌.
  • అమెరికాలో గ్రీన్‌కార్డు దొరికితే సంబరాలు చేసుకుంటున్నారు. మోడీ పాలనలో 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలేశారు. ఇది దౌర్భాగ్యం కాదా?
  • కాంగ్రెస్ స‌రిగా పనిచేయడం లేదని 2014లో మోడీకి ఓటేశారు. తెలంగాణ పరిస్థితి పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది. ప్రధానిగా మోడీ కన్నా మన్మోహన్‌ సింగ్ బాగా పనిచేశారు. కానీ, ఆయ‌న ఎక్క‌డా ఇలా ప్ర‌చారం చేసుకోలేదు.
  • ది లాస్ట్‌ డికేడ్‌ బుక్‌ను గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన కేసీఆర్‌, దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు.
  • దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. మోడీ గెలిచారు.. బీజేపీ గెలిచింది.. కానీ దేశ ప్రజలు ఓడారు.
  • అన్ని రంగాల్లో దేశం తీవ్రంగా నష్టపోయింది. దేశం దివాళా తీసినా తమదే పైచేయి అంటున్నారు.
  • పార్లమెంట్‌లో ప్రధాని మోడీ ప్రసంగం అధ్వాన్నంగా ఉంది
  • అదానీ గురించి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు.
  • అదానీ రూపంలో దేశానికి మరో ఉపద్రవం వచ్చింది.

This post was last modified on February 13, 2023 9:31 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

4 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago