Political News

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ గేలం.. చంద్ర‌బాబు ఏం చేశారంటే!

ప్ర‌స్తుతం ఏపీలో జంపింగుల కాలం ప్రారంభ‌మైంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో కి నేత‌లు జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవ‌ల వైసీపీ నుంచి తాను టీడీపీలోకి వెళ్తున్న‌ట్టుగా.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనికి విరుగుడుగా.. వైసీపీ కూడా టీడీపీలో ఉన్న కీల‌క నేత‌ల‌కు గేలం వేసే ప‌నిని ప్రారంభించింది. ఇలా.. అనుకున్న వెంట‌నే.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సోద‌రుడు.. తుని టీడీపీ ఇంచార్జ్ కృష్ణుడు ఉర‌ఫ్ ప‌ళ్ల కృష్ణుడుకు వైసీపీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

పార్టీలోకి వ‌స్తే.. కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌ని ఆయ‌నకు హామీ ఇచ్చిన‌ట్టు కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉంది. అయితే..ఈ విష‌యంపై స‌మాచారం తెలిసిన వెంట‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబు రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన య‌న‌మ‌ల సోద‌రులు ఇద్ద‌రినీ త‌న వ‌ద్ద‌కు పిలుచుకుని పంచాయ‌తీ పెట్టారు. వాస్త‌వానికి 2014, 2019లో తుని టీడీపీ టికెట్‌ను కృష్ణుడుకు ఇచ్చారు. అయితే, ఆయ‌న వ‌రుస‌గా ప‌రాజ‌యం పాల య్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ వ్యూహం మార్చాల‌ని నిర్ణ‌యించింది.

దీనిలో భాగంగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్‌ను దాదాపు క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీంతో కృష్ణుడు అల‌క వ‌హించారు. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందని అనుచ‌రుల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కృష్ణుడుపై వైసీపీ గేలం వేసింది. పార్టీలో కీలక పదవి ఇస్తామని ఆశ చూపింది. కాగా, చంద్ర‌బాబు వ‌ద్ద జ‌రిగిన పంచాయ‌తీలో కృష్ణుడుకు బ‌ల‌మైన హామీ ఇచ్చార‌ని తెలిసింది. దీంతో వైసీపీ వేసిన వ్యూహానికి చంద్ర‌బాబు ఇలా చెక్ పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు కృష్ణుడు కూడా చంద్ర‌బాబు వ్యూహంతో సంతోషంతో ఉన్న‌ట్టు చెప్పారు.

This post was last modified on February 9, 2023 9:43 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

4 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

5 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

9 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago