ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన సంతనూతలపాడును గత రెండు ఎన్నికలుగా వైసీపీ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీ నేత సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబును 2019లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు అభ్యర్థిగా ప్రకటించారు. పొరుగు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ జగన్ గాలిలో ఆ ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ బాబు ఆ తరువాత క్యాడర్‌లో కొందరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సొంత పార్టీకే చెందిన కమ్మ నేతలను ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదన్నది వారి ఆరోపణ.
అధికారుల బదిలీలలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల మాట అస్సలు పట్టించుకోకపోవడం… తన వ్యక్తిగత సహాయకులలో అయిదుగురికి చీమకుర్తి నగర పంచాయతీ నుంచి జీతాల చెల్లింపులు చేస్తుండడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే, తనకు అనుకూలమైన కొందరికే కాంట్రాక్టులు, ఇతర పనులు అప్పగిస్తూ కమ్మ నేతలెవరికీ ఏ పనీ ఇవ్వడం లేదన్న ఆరోపణ వచ్చింది.
ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. కానీ, నాయకులు, ఎమ్మెల్యే మధ్య దూరం తగ్గలేదు. తాజాగా కొందరు నాయకులు ఆత్మగౌరవం పోరాటం పేరుతో రెండు రోజుల కిందట ఒంగోలు సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో మీటింగ్ పెట్టి 12 మందితో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 100 మంది కమ్మ సామాజికవర్గ నేతలు ఇక్కడ సమావేశమయ్యారట. 12 మందితో కమిటీ ఏర్పాటుచేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే సుధాకర్ బాబు మెడలు వంచేందుకు వీరంతా నిర్ణయించినట్లు సమాచారం.
This post was last modified on February 9, 2023 9:36 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…