ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తోట చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న కొందరు మాజీ అధికారులు వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లారు. అందులో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు కుడా ఉన్నారు. త్వరలో విశాఖలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు బీఆర్ఎస్ గాలం వేసిసట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, విశాఖలో ప్రత్యక్షమై వారిద్దరితో భేటీ అయ్యారు. కాపు, బలిజ వర్గాలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఏపీ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వారిద్దరినీ గౌడ్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయని దగ్గరి వారు చెబుతున్నారు. వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిట్లు వార్తలు కూడా వచ్చాయి.
నిజానికి గంటా కొంతకాలంగా టీడీపీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ, నిరసనోద్యమాల్లోనూ పాల్గొనడం లేదు. దానితో ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. చివరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన గంటా.. అనివార్య కారణాలతో క్రియాశీలంగా ఉండలేకపోయానని ఇకపై చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇంతలోనే అయ్యన్న పాత్రుడు ఆయనపై విమర్శలు సంధించడం కూడా జరిగపోయింది. అయితే గంటా, టీడీపీలో క్రియాశీలంగా ఉన్నట్లు కనిపించలేదు.
జేడీ లక్ష్మీ నారాయణ ఐపీఎస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. విశాఖ లోక్ సభా స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన టీవీ చర్చలకు, సామాజిక కార్యక్రమాలకు పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఒక మంచి పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే గౌడ్ తో భేటీ అయిన మాట నిజమేనని గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. అయితే రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఒక పెళ్లి కార్యక్రమంలో కలిశామని, అప్పుడు కొందరు ఫోటోలు తీశారని వెల్లడించారు. అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యమేదీ లేదని అన్నారు. తాను ముమ్మాటికి తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసిన వార్తలు, ఆపై వచ్చిన ఉహాగానాలకు తెరదించేందుకు గంటా ప్రయత్నించినా విశ్వసించేందుకు రాజకీయ వర్గాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే సొంత పార్టీ టీడీపీలోనే ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
This post was last modified on February 3, 2023 8:44 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…