2002- సంవత్సరంలో దేశంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలేంటి? అనగానే వెంటనే గుజరాత్‌లో చోటు చేసు కున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అనేది తొలి వరుసలో ఉంటుంది. దీనికి కారణం.. అప్పట్లో దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీనే ఉన్నారు.
దీంతో ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్టకేలకు రెండేళ్ల కిందట.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విషయం సమసిపోయిందని అందరూ భావిస్తున్న సమయం లో అనూహంగా ఇప్పుడు బ్రిటన్‌కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజరాత్ అల్లర్లపై “ద మోడీ క్వశ్చన్” పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న సమయాన్ని ప్రస్తావించారు.
విశ్వహిందూపరిషత్.. ఆర్ఎస్ఎస్‌లు కలిసి ఉమ్మడిగా ఈ దారుణ మారణహోమాన్ని సృష్టించాయని పేర్కొన్న ఈ డాక్యమెంటరీ.. దీనికి బలమైన ఊతం మోడీనేనని పేర్కొనడం భారత్‌కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వగురువుగా’ కీర్తించబడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయని అందుకే 2002లో గుజరాత్ అట్టుడికిందని పేర్కొంది.
ఇక, ఈ డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.
This post was last modified on January 20, 2023 8:56 am
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…