ఖమ్మంలో బీఆర్ ఎస్ పార్టీ నిర్వహించిన తొలి ఆవిర్భావ సభ సక్సెస్ అయింది. కేంద్రంపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఆయనకు దన్నుగా వచ్చిన.. పలువురు ముఖ్యమంత్రులు కూడా విమర్శలు గుప్పిం చారు. అయితే.. ఇది ఎలా ఉనప్పటికీ.. సభను విజయవంతం చేయడంలో బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీష్‌రావుకు ఇప్పుడు పెద్ద సమస్యే వచ్చి పడింది. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలను తరలించారు.
ఐదులక్షల మందిని తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. అయితే.. ఇలా వచ్చిన వారు.. ఇప్పుడు పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఎందుకంటే.. ఉదయం 10 గంటలకు సభా ప్రాంగణానికి తీసుకువ చ్చిన తమకు రూ.300 నుంచి 500 చొప్పున ఇస్తారని నాయకులు ప్రకటించారని, అయితే.. తమకు చేతిలో 100 రూపాయలు పెట్టి చేతులు దులుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.
ఇంట్లో ఉన్న తమను తీసుకువచ్చి వదిలేశారని.. కనీసం 300 ఇస్తామని ఇస్తామని చెప్పారని.. కానీ, 100 రూపాయలు ఇస్తున్నారని.. తమకు తాగేందుకు మంచినీరు కూడా ఇవ్వలేదని చెప్పారు. వచ్చే టప్పుడు మాత్రం తమకు బిర్యానీ పాకెట్లు ఇస్తామన్నారు. ఇవెలా ఉన్నా.. తినడానికి అన్నం కూడా పెట్టలేదన్నారు. ఇది న్యాయమేనా కేసీఆర్ సారూ? అని ప్రశ్నిస్తున్నారు.
సభకు పిలిచి అన్నం కూడా పెట్టరా? ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వరా అని వాపోతున్నారు. తెచ్చేట ప్పుడు ఆటోలు పెట్టారని.. వెళ్లడానికి కనీసం బస్సు కూడా లేదని వాపోయారు. అంతేకాదు.. మళ్లీ సభలు జరగవా? అప్పుడు వస్తమనుకుంటన్నరా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సభకు వచ్చిన వారి బాధలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates