Political News

దేశ‌మంతా ఉచిత విద్యుత్‌: కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఖమ్మంలో జ‌రిగిన‌ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే.. దేశం మొత్తం రైతుల‌కు ఉచితంగా క‌రెంటు ఇస్తామ‌న్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేత‌లు దేశంలో మతపిచ్చి లేపుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తే.. కేంద్రం తీసుకువ‌చ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని కూడా కేసీఆర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా? అని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలన్నారు. “విద్యుత్ కార్మికులారా? పిడికిలి బిగించండి. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా.. మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తామ‌ని మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని కేసీఆర్ తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మితే బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక కొంటామని అన్నారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి ప్ర‌జ‌ల‌కు మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని విమర్శించారు.

మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలు రూపొందిస్తున్నారన్నారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామ‌ని చెప్పారు.

This post was last modified on January 18, 2023 9:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago