ఏపీలో ఎవరు ఏమనుకున్నా.. ఎన్ని తిట్టుకున్నా.. రాజకీయాలు కులం రంగును పులిమేసుకున్నాయి. దీనికి ఏ కులమూ అతీతంకాదు. రెడ్లు అంటే.. వైసీపీ, కమ్మలు అంటే.. టీడీపీ అన్న పేరు ఉండనే ఉంది. ఇక, ఇతర కులాల్లోనూ.. మెజారిటీ సామాజిక వర్గాలు.. వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని.. ఈ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇక, ఎటొచ్చీ.. ఏపీలో 15 శాతంగా(తాజాగా లెక్కల ప్రకారం) ఉన్న కాపులు ఎటు? అనేది మాత్రం తేలడం లేదు. నిన్న మొన్నటి వరకు.. కాపులు ఎన్నికల సమయానికి యూట ర్న్ తీసుకున్న సందర్భాలు ఉన్నా యి. 2014లో టీడీపీకి అనుకూలంగా ఓటేత్తారు. ఇక, 2019లో మాత్రం.. వైసీపీకి అనుకూలంగా మారారు. ఇక, ఇప్పుడు జనసేనవైపు చూడాలని.. జనసేనను అధికారంలోకి తేవాలని.. మెజారిటీ కాపు నాయకులు భావిస్తున్నారు.
ఇది సాధ్యమే.. అని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ వేస్తున్న అడుగులే వారిని తర్జన భర్జనకు గురి చేస్తున్నాయి. కొంత సేపు.. ఒంటరి పోరు.. అని మరికొంత సేపు.. ప్రజలు నావెంట నిలవ డం లేదు.. అందుకే.. పొత్తులకు వెళ్తానని.. వీరమరణం కోరుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇంకొంత సేపు.. ఎవరి పల్లకీని తాను మోయబోనని అంటున్నారు. సో.. ఇవన్నీ కూడా కాపులను డోలాయమానంలో పడేస్తున్నాయి.
వారు ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. పోనీ.. జనసేన కాదు.. వైసీపీని నమ్ముదామంటే.. ఇప్పటికే.. కాపులకు రిజర్వేషన్ లేకుండా చేశారని.. వారికి కనీసం కార్పొరేషన్ నిధులు కూడా ఇవ్వడం లేదని.. గుస్సాగా ఉన్నారు. అలాకాదు.. టీడీపీతో వెళ్దామా? అంటే.. సీనియర్ నాయకులకు గతంలో జరిగిన అనుభవాలు వారిని పీడిస్తున్నాయి. వెరసి.. ఎటూ తేల్చుకోలేక.. పవన్ అడుగులు గుర్తించలేక.. కాపు నాయకులు త్రిశంకు స్వర్గంలో అల్లాడిపోతున్నారు. మరి ఈ ఊగిసలాటలు ఎన్నాళ్లు కొనసాగుతాయో చూడాలి.
This post was last modified on January 16, 2023 12:51 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…