తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో ఆయన చేసిన డైలాగులు.. పేల్చిన పంచ్‌లు జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంబరాల రాంబాబు డైలాగును వైసీపీ నాయకులు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆయా డైలాగులకు సంబంధించిన వీడియోలు ముక్కలు ముక్కలుగా టీడీపీ నేతలే వైరల్ చేస్తుండడం గమనార్హం.
ఈ వీడియోల్లో సీఎం జగన్ నుంచి మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, సలహాదారు రామకృష్నారెడ్డి వంటివారిపై పవన్ పేల్చిన పంచ్‌లు ఉన్నాయి. ఇవి యువత నోటిలో నానుతున్నాయి. ఇవి కనుక ప్రజల్లోకి వెళ్తే.. తమకు ఇబ్బంది తప్పదని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. పవన్ చేసిన వ్యాఖ్యల్లో ఎక్కువగా మూడుముక్కల జగన్
ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.
అదే సమయంలో సంబరాల రాంబాబు కూడా వైరల్‌గా మారింది. ఇక, సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి.. డంకాపలాస్ అని వ్యాఖ్యానించారు. ఇది పెద్దగా వైరల్ కాకపోయినా.. ఇతర వ్యాఖ్యలు మాత్రం జోరుగా వైరల్ అవుతున్నాయి. ఇక, మంత్రి రోజాను ఉద్దేశించి డైమండ్ రాణి
అని వేసిన పంచ్ కూడా సీమ ప్రాంతంలో జోరుగా వైరల్ అవుతోంది. గుడివాడ నానిని ఉద్దేశించి పులి-మేక, గుడివాడ అమర్నాథ్ ,పేర్ని నానిలను ఉద్దేశించి వందిమాగధులు అంటూ..పవన్ పంచ్‌లే శారు.
ఇప్పుడు ఇవన్నీ.. కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సీఎం జగన్, రోజా, అంబటిపై పేల్చిన పంచ్‌లకు కౌంటర్ పంచ్‌లు వేయాలని.. పార్టీ అదిష్టానం నుంచి ఆదేశాలు అందాయని తెలుస్తోంది. మరి మంత్రులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on January 14, 2023 10:28 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…