రాజకీయాల్లో ఏ పరిస్థితిని అయినా..తనకు అనకూలంగా మార్చుకుని.. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడే బీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇప్పుడు ఏపీ వైసీపీ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. విభజన అంశాలపై, ముఖ్యంగా ఏపీకి రావాల్సిన సంస్థల విషయంపై దాదాపు 8 సంవత్సరాలుగా ఉలుకు.. పలుకు లేకుండా.. తెలంగాణ సర్కారు వ్యవహరిస్తున్న కేసీఆర్‌ను న్యాయస్థానానికి లాగేసింది.
అది కూడా..ఈ ఏడాది తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోను.. మరోవైపు ఏపీలో అడుగులు వేసేందుకు కేసీఆర్ సిద్ధమైన సమయంలోను వైసీపీ ప్రభుత్వం విభజన అంశాల అస్త్రాన్ని తెరమీదికి తీసుకువచ్చి.. సుప్రీం గడప తొక్కడం.. రాజకీయంగా కేసీఆర్‌కు పెను ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉంది. ఎటు వైపు అనుకూలంగా వ్యవహరించినా.. జాతీయనేతగా.. ఆయనకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ఒకటి: విభజన చట్టంలో పేర్కొన్న విధంగా చూస్తే.. ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచుకోవాల్సి ఉంది. దీనికి తెలంగాణ సర్కారు మరో వాదన తెరమీదికి తెచ్చింది. ఎక్కడి ఆస్తులు అక్కడే అని చెబుతోంది. ఇక, ఇప్పుడు సుప్రీం గడప తొక్కిన నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? అనేది ప్రశ్న. ఆయన ఇప్పుడు జాతీయ పార్టీ నాయకుడు కూడా కావడంతో కేవలం తెలంగాణ వాదాన్ని వినిపిస్తే.. ఇబ్బందులు తప్పవు.
అలాగని.. చట్టం ప్రకారం చేయమంటే.. ఏపీకి మెజారిటీ ఆస్తులు దక్కుతాయి. ఇది తెలంగాణ సెంటిమెంటుకు, నిధులు, నీళ్లు, నియామకాలు అన్న కీలక నినాదానికి .. కేసీఆర్ తెరదించేసినట్టు అవుతుంది. అలా కాకుండా.. ఏపీకి ఆ ఆస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని వాదిస్తే..ఏపీలో ఏ మొహం పెట్టుకుని.. అడుగు పెడతారు? అనేది మరో కీలక ప్రశ్న. ఏపీకి ఇప్పటికే అన్యాయం చేశారనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సయమంలో విభజన షెడ్యూల్‌లోని 9,10 అంశాల్లోనూ అన్యాయం చేస్తే..ఏపీ ప్రజలు రగిలిపోవడం ఖాయం. సో.. ఎలా చూసుకున్నా.. కేసీఆర్‌కు ఈ కేసు రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు తెచ్చేలా ఉందని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 9, 2023 3:30 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…