వారసుడు ట్రైలర్ వచ్సినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్ గురించి ఇవాళ దిల్ రాజు స్పందించారు. గతంలో చూసిన ఎన్నో సినిమాల మిక్సీగా ఇది ఉందని, వివిధ బ్లాక్ బస్టర్స్ లో ఒక్కో పాయింట్ ని తీసుకుని కథగా అల్లేశారనే ట్వీట్లు వీడియోల సాక్షిగా కుప్పలు తెప్పలు వచ్చి పడ్డాయి. ఒకరకంగా ఇది నెగటివిటీని కూడా తెచ్చి పెట్టింది. వ్యక్తమైన అభిప్రాయాల్లో నిజముందనేలా ఎస్విసి టీమ్ దాన్ని ఎడిట్ చేసిన విధానం కూడా అలాగే ఉంది. సరే ఎవరు ఔనన్నా కాదన్నా కళ్ళముందు కనిపించేది కాదని అనలేరు కాబట్టి రాజుగారి సమాధానం మీద ఆసక్తి రేగింది.
ఇదంతా సబ్జెక్టు ఊహించినప్పుడే అర్థమయ్యిందని ఇంత అనుభవమున్న తాను ఆ మాత్రం పసిగట్టలేనా అని చెబుతూనే విజయ్ ఇమేజ్ కి తగట్టు ఇందులో అన్ని అంశాలు ఉన్నాయని, కేవలం రెండున్నర నిమిషాలకే ఒక కంక్లూజన్ కు రావడం కరెక్ట్ కాదని, ఎమోషన్ కనెక్ట్ అయితే ప్రేక్షకుడు ఇవన్నీ పట్టించుకోరని కౌంటర్ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ పోలికలు అసలు లేవని కానీ, ఇది చాలా ఫ్రెష్ స్టోరీ అని కానీ తీవ్రంగా బుకాయించకపోవడం విశేషం. కంటెంట్ లో బలముంటే అది గతంలో చూశామా లేదా అని ఆడియన్స్ పట్టించుకోరనే లాజిక్ లో నిజం లేకపోలేదు. ధమాకా ఋజువు చేసిందిగా.
ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజు గారి ప్రెస్ మీట్ గురించే వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. చిరంజీవి బాలకృష్ణల కోసమే త్యాగం చేయాల్సి వచ్చిందన్న ఆయన తెలుగు డబ్బింగ్ వెర్షన్ పనులు ఈ రోజుతో అయిపోతాయని, రేపటికి సెన్సార్ సర్టిఫికెట్ వస్తుందని మరో ట్విస్ట్ ఇచ్చారు. అంటే ఓవర్సీస్ కి డ్రైవ్ అప్లోడ్ వెళ్లలేదనే సందేహానికి దీన్నుంచి ఆన్సర్ దొరికిపోయింది. పెద్ద సినిమాలకు చివరి నిమిషం హడావిడిలు సహజమే కానీ పక్కా ప్లానింగ్ తో ఉండే దిల్ రాజుకి సైతం ఈ ఇబ్బంది తప్పకపోవడం విచిత్రం. మనకు వారసుడు ఎప్పుడు వచ్చినా వరిసు తమిళ ఫలితం ఇంకో ముప్పై ఆరు గంటల్లో తేలిపోతుంది.
This post was last modified on January 9, 2023 1:30 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…