ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి పెద్దచిక్కే వచ్చిపడింది. ఎమ్మెల్యే మేకపాటి తన తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారాయి. 18 ఏళ్లుగా తమను వదిలేసి రహస్యంగా ఉంచారంటూ ఆ యువకుడు లేఖ రాసి ఆరోపణలు చేయగా… ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదంతా అవాస్తవమంటూ ఒక వీడియో విడుదల చేశారు. తనకు కొడుకులు లేరని, ఇద్దరూ కుమార్తెలేనంటూ ఆయన వీడియో రిలీజ్ చేశారు. శివచరణ్ రెడ్డి, ఆయన తల్లి తనను డబ్బు కోసం ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. రాజకీయ ప్రత్యర్థులు ఇలా తనపై బురద జల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే… మేకపాటి ఇటీవల కొంతకాలంగా తన వెంట శాంతికుమారి అనే మహిళను తిప్పుతూ ఆమే తన భార్య అని చెప్తున్నారు. కొద్దికాలంగా ఈ విషయంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. తాజా వివాదం నేపథ్యంలో ఆయన శాంతికుమారి ఎవరనేది కూడా చెప్పారు. శాంతికుమారితో తనకు 29 ఏళ్ల కిందట అనుబంధం ఏర్పడిందని, ఆమె కూడా తన భార్యేనని చెప్పారు. తన మొదటి భార్య తులసమ్మ ద్వారా పెద్ద కుమార్తె లక్ష్మీరచనారెడ్డి జన్మించారని, శాంతికుమారి ద్వారా సాయిప్రేమితారెడ్డి జన్మించారని.. వారిద్దరే తన సంతానమని మేకపాటి చెప్పారు. ప్రస్తుతం తాను శాంతికుమారి, సాయిప్రేమితారెడ్డిలతో ఉంటున్నట్లు చెప్పారు.
ఇప్పుడు తన కుమారుడిగా చెప్తున్న శివచరణ్ రెడ్డి తల్లి పేరు లక్ష్మి అని.. ఆమె భర్త కొండారెడ్డి అని మేకపాటి చెప్తున్నారు. అయితే, శివచరణ్ విడుదల చేసిన లేఖలో మేకపాటి తనకు ఫీజులు కట్టారని చెప్పారు. అంతేకాదు.. తన తల్లి, తాను, మేకపాటి ఉన్న ఫొటోలనూ విడుదల చేశారు.
అంతేకాదు… తాను చట్టపరంగా పోరాడుతానని శివచరణ్ రెడ్డి చెప్పడంతో విషయం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే మేకపాటి వివాదాన్ని గతంలో ఏపీకి గవర్నరుగా పనిచేసిన ఎన్డీ తివారీ వ్యవహారంతో పోల్చుతున్నారు కొందరు.
యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా.. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నరుగా పనిచేసిన తివారీ కూడా ఇలాంటి వివాదమే ఎదుర్కొన్నారు. ఎన్డీ తివారీ ఏపీ గవర్నరుగా ఉన్న కాలంలోనే ఈ వివాదం మొదలైంది. 2008లో రోహిత్ శేఖర్ అనే యువకుడు ఎన్డీ తివారీ తన తండ్రి అంటూ కోర్టులో కేసు వేశారు. తివారీ దాన్ని ఖండిస్తూ వచ్చారు. చివరకు డీఎన్ఏ టెస్టులో రోహిత్.. తివారీ కుమారుడేనని తేలడంతో ఆయన చివరకు అంగీకరించారు. అయితే.. 2018లో ఎన్డీ తివారీ మరణించారు. ఏడాదిలోనే రోహిత్ శేఖర్ కూడా పెళ్లయిన కొద్దిరోజులకే ఇంట్లోనే భార్య చేతిలో హత్యకు గురయ్యారు.
This post was last modified on January 8, 2023 9:01 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…