Political News

సాయిరెడ్డి బాధ్యతలు సజ్జల కొడుక్కి..

వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం, పట్టు క్రమంగా తగ్గుతోందా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీకి చెందినవారు. ఇప్పటికే విజయసాయిరెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డి ఓవర్టేక్ చేశారని… సాయిరెడ్డి మేకపోతు గాంభీర్యంతో నెట్టుకొస్తున్నారని అంటున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో సాయిరెడ్డి చేతిలో ఉన్న కొద్దిపాటి పవర్స్ కూడా పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు.

వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా బాధ్యతలన్నీ తానే చూస్తున్నారు విజయసాయిరెడ్డి. దీనికోసం ఆయన భారీ టీంలు ఏర్పాటు చేసుకుని ముందుకుసాగుతున్నారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలలో అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా విభాగం ఉన్నది వైసీపీకే. వైసీపీ సోషల్ మీడియా విభాగంతో టీడీపీ సోషల్ మీడియా విభాగం ఏమాత్రం పోటీపడలేని పరిస్థితి. అంతేకాదు.. జాతీయ స్థాయిలో బలమైన సోషల్ మీడియా వింగ్స్ ఉన్న బీజేపీ కూడా ఏపీలో వైసీపీ సోషల్ మీడియా విభాగాలకు ఎదురు నిలవలేని పరిస్థితి.

జగన్ ప్రభుత్వ పాజిటివ్ అంశాలు ప్రచారం చేయాలన్నా… ప్రతిపక్ష పార్టీలు, ప్రతిపక్ష నేతల నెగటివ్ పాయింట్స్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా… చివరకు న్యాయమూర్తుల విషయంలో దూకుడుగా వ్యవహరించాలన్నా.. తిమ్మిని బమ్మి చేయాలన్నా… మెయిన్ స్ట్రీమ్ మీడియాను డిఫెన్స్‌లో పడేయాలన్నా.. వారిని ప్రభావితం చేయాలన్నా… ఏదైనా వైసీపీ సోసల్ మీడియా విభాగాలకే సాధ్యం. అంత పటిష్ఠంగా, పదునుగా తయారు చేశారు విజయసాయిరెడ్డి. ఏమాటాకామాట చెప్పుకోవాలి ఈ క్రెడిటంతా విజయసాయిరెడ్డిదే. వైసీపీ సోషల్ మీడియా కోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేసేవారు సుశిక్షితులైన సైనికుల్లా… సేనాధిపతి ఆదేశాలను తూచా తప్పుకుండా పాటించి శత్రువులపై దాడికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.

అలాంటి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు ఇప్పుడు విజయసాయిరెడ్డి చేతుల నుంచి జారిపోయాయి. వైసీపీ సోషల్ మీడియా హెడ్‌గా భార్గవరెడ్డిని నియమించారు జగన్. భార్గవ్ రెడ్డి అంటే ఎవరో కాదు… సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు.

వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు భార్గవరెడ్డికి ఇవ్వాలని రెండు నెలల కిందటే నిర్ణయించినా బుధవారం ఆ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు. ఈ బాధ్యతేకాదు.. తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్న మీడియా కోఆర్డినేషన్ బాధ్యతలూ భార్గవరెడ్డికే ఇచ్చారు.

సజ్జల కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించడంతో విజయసాయిరెడ్డికి ఇబ్బందేనంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు, టీడీపీ నుంచి తనకు ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టడానికి.. తాను వారిపై చేసే విమర్శలను ముందుకు తీసుకెళ్లడానికి వైసీపీ సోషల్ మీడియాను సాయిరెడ్డి విపరీతంగా వాడుకున్నారు. ఇకపై ఆయనకు ఆ అవకాశం ఎంతవరకు ఉంటుందనేది చూడాలి.

అయితే… ఇలాంటివి ముందుగానే ఊహించారో ఏమో కానీ చాలాకాలంగా విజయసాయిరెడ్డి సొంతంగా ఓ సోషల్ మీడియా వింగ్ కూడా నడుపుతున్నారు. వారిపని విజయసాయిరెడ్డి ఇమేజ్ బిల్డ్ చేయడం, ఆయనపై విమర్శలను తిప్పికొట్టడం, ప్రత్యర్థులుపై ఎదురుదాడి చేయడమే. పార్టీ సోషల్ మీడియా చేజారినా సొంత సోషల్ మీడియా చేతిలో ఉండడంతో విజయసాయిరెడ్డి ఎప్పటిలాగే దూకుడు చూపుతారంటున్నారు ఆయన వర్గం వారు.

This post was last modified on January 5, 2023 9:40 am

Share
Show comments

Recent Posts

మరో సారి కేటీఆర్ పై రెచ్చిపోయిన కొండా సురేఖ

లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…

3 hours ago

ధనుష్ కోసం నయన్ ఫ్రీ సాంగ్

రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…

5 hours ago

విశ్వసుందరి కిరీటం విక్టోరియాకే.. ఇది మరో చరిత్ర!

ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…

5 hours ago

ఆదివారం కూడా.. కేసీఆర్‌ను వ‌దిలిపెట్ట‌వా రేవంత్‌!?

సండే ఈజ్ ఏ హాలీడే కాబ‌ట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్ర‌జ‌లంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజ‌కీయ‌ నాయ‌కులు మాత్రం…

6 hours ago

కేజ్రీవాల్ కు మరో దెబ్బ..

దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…

6 hours ago

కీర్తి సురేష్ పెళ్లి.. నిజమేనా?

ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…

6 hours ago