ప్రధాన మోడీ మంత్రి మాతృమూర్తి హీరాబెన్ శుక్రవారం తెల్లవారు జామున 3.30గంటల సమయంలో అహ్మ దాబా ద్‌లోని ఓఆసుపత్రిలో మృతి చెందారు. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా.. ఇలాంటి విషాదాలు చోటు చేసుకుంటే.. ఆ కుటుంబంలోని వారంతా.. ఇతరపనులు పక్కన పెట్టి.. ఈ కార్యక్రమాల్లో ఉండిపోతా రు. అయితే.. ప్రధాని మోడీ మాత్రం తన షెడ్యూల్‌ను మార్చాలేదు. తన పనికి ఆటంకంగా భావించలేదు.
ప్రధానిగా ఆయన నిర్ణయం తీసుకున్న షెడ్యూల్ ప్రకారం తన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమ య్యారు. శుక్రవారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో హీరా బెన్ మృతి చెందారు. అయితే.. గుజరాతీ సంప్రదాయం ప్రకారం.. 5 గంటల్లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని శుక్రవారం పాల్గొనాల్సిన కార్యక్రమాలు రద్దవుతాయని అందరూ భావించారు. అయితే.. ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఆయా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది.
వాస్తవానికి ముందుగానే నిర్ణయించుకున్న షెడ్యల్ ప్రకారం.. మోడీ శుక్రవారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ సందర్భంగా ఆయన 7 వేల 8 వందల కోట్ల రూపాయలకు పైబడి విలువైన ప్రాజెక్టులకు… శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేయాలి. కోల్ కతాలో జాతీయ గంగా కౌన్సిల్ రెండో సమావేశానికి అధ్యక్షత వహించాలి. పశ్చిమ బెంగాల్ లో 2 వేల 550 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం చేయాల్సి ఉంది. అదేవిధంగా హౌరా నుంచి న్యూజెల్ పాయ్ గురిని కలిపే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని ప్రారంభించాల్సి ఉంటుంది.
అయితే.. తన మాతృమూర్తి మరణించినప్పటికీ.. మోడీ ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ, ప్రత్యక్షం గా కాకుండా.. పరోక్షంగా ఆయన వర్చువల్ విధానంలో ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటారని పీఎం ఆఫీస్ తెలిపింది. దీనికి కారణం కూడా మోడీ పేర్కొన్నారు. తన మాతృమూర్తి 100వ పుట్టిన రోజు నాడు.. తనకు చేసిన ఉపదేశమేనని పేర్కొన్నారు. “ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ప్రజలకు సేవ చేయడంలో మాత్రం ఆలస్యం చేయకు. ప్రజలే ముందు. కుటుంబం తర్వాతే” అని తన మాతృమూర్తి చేసిన ఉపదేశాను సారం.. ఈ కార్యక్రమాలకు మోడీ హాజరవుతున్నట్టు పీఎంవో వర్గాలు పేర్కొనడం గమనార్హం.
కాగా, గతంలో ప్రధానులు.. వారి వారి ఇళ్లలో ఇలాంటిసందర్భాలు ఎదురైనప్పుడు.. కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.కానీ, మోడీ వారికి భిన్నంగా తన తల్లి చూపిన బాటలో ప్రజాసేవలోనే గడపనున్నారు. తద్వారా.. అదే తన తల్లికి తాను ఇచ్చే ఘన నివాళిగా ఆయన పేర్కొన్నారు.
This post was last modified on December 30, 2022 12:13 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…