దేనినైనా.. తమకు అనుకూలంగా మార్చుకోగల దిట్ట వైసీపీ కీలక నాయకుడు.. సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన మాటలు వేడిగా ఉండకపోయినా..వాడిగా ఉంటాయి. ఆయన చించేసుకుని మాట్లాడడు. కానీ, చిరిగిపోయే మాటలే ఎక్కువగా ఉంటాయని పార్టీ నాయకులు అంటుంటారు. తాజాగా టీడీపీ కందుకూరు ఎపిసోడ్‌పై.. ఆయన సుతిమెత్తగానే అయినా సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కావాలని.. ఉద్దేశపూర్వకంగానే ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహించారని, కందుకూరులో జన సంద్రం అని ప్రచారం చేసుకోవాలనుకున్న ప్లాన్ బెడిసి కొట్టిందని సజ్జల ఉవచించారు. జనం ఎక్కువ వచ్చారని పబ్లిసిటీ చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని అన్నారు. కానీ, ఆ పబ్లిసిటీకి ఎనిమిది మంది బలయ్యారన్నారు.
‘‘పోలీసుల సూచనలు ఏవైనా పాటించారా?. అనుమతి తీసుకున్న ప్రాంతం కంటే ముందుకెళ్లి సభ నిర్వహించారు. పైగా పోలీసులపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారా?’’ అని చంద్రబాబును నిలదీశారు. ఆ ఇరుకురోడ్డులో రోడ్‌షో నిర్వహణ ద్వారా.. డ్రోన్ షాట్లతో జనాలు బాగా వచ్చారని చూపించుకునే ప్రయ త్నం చేశారు. కందుకూరు తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
ఫేస్ రీడింగ్ చేశారట..
కందుకూరు ఘటనపై చంద్రబాబు మొహంలో పశ్చాత్తాపమే కనిపించడం లేదని అంటూ.. ఆయన ఫేస్‌పైనా సజ్జల కామెంట్లు కుమ్మరించారు. బాబులో లెక్కలేనితనం, అహంకారమే కనిపిస్తోందన్నారు. ఈ దుర్ఘటనను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్ష నేత యత్నించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు వికృత విన్యాసంలో ఈ నరబలి జరిగిందని ఘాటు వ్యాఖ్య చేశారు. మొత్తానికి ఒకసారి వినేసి.. పక్కన పెట్టేసే టైపులో సజ్జల కామెంట్లు ఉన్నాయని నెటిజన్లు అంటున్నారు.
This post was last modified on December 29, 2022 9:34 pm
మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రానే వచ్చింది. నిన్న సాయంత్రమే ‘పుష్ప: ది రూల్’ ట్రైలర్‌ను వివిధ భాషల్లో లాంచ్ చేశారు.…
రానాను చిరంజీవి కొట్టడం ఏంటి.. అంత తప్పు ఏం చేశాడు.. రానాను కొట్టేంత చనువు చిరుకు ఉందా అని ఆశ్చర్యపోతున్నారా?…
‘పుష్ప: ది రైజ్’ సినిమాలో మిగతా హైలైట్లన్నీ ఒకెత్తయితే.. సమంత చేసిన ఐటెం సాంగ్ మరో ఎత్తు. అప్పటిదాకా సమంతను…
కోలీవుడ్‌లో పిన్న వయసులోనే మంచి పేరు సంపాయించుకున్నయువ హీరో దళపతి విజయ్. విజయ్ సినిమాలు.. క్రిటిక్స్, రివ్యూస్‌కు సంబంధం లేకుండా..…
జైలర్ లో చేసింది క్యామియో అయినా తెలుగు తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్…
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే.…