లేస్తే.. తగ్గేదేలేదు..! అన్నట్టుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై నిప్పులు చెరిగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. గతం లోనూ ధాన్యం కొనుగోలు విషయంలో తలెత్తిన వివాదంతో రోడ్డెక్కారు . సీఎంగా ఉంటూనే.. ఇందిరా పార్కు దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఇక, అదేవిధంగా ఇతర సమస్యలపైనా కేంద్రాన్ని ఆయన నిలదీస్తున్నారు. తాజాగా కూడా ఉపాధి హామీ పనులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన నిధులను రైతుల కల్లాలకు.. సంబంధించి ఖర్చు చేయడంపైనా.. కేంద్రం తాఖీదులు పంపించడాన్ని తప్పు బట్టారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
ఇదిలావుంటే.. వీటికన్నా ముఖ్యంగా రాష్ట్ర ప్రబుత్వానికి కేంద్రం ఇవ్వాల్సిన సొమ్ము 40 వేల కోట్లు ఇవ్వక, తాము అప్పులు చేసుకుంటామంటే కూడా సహకరించడం లేదని సీఎం కేసీఆర్ తరచుగా చెబుతున్నారు. ఈ క్రమంలో దీనిని నిరసించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఏదో సాధారణ నిరసన కాకుండా.. అసెంబ్లీ వేదికగానే నిప్పులు చెరిగి రికార్డు సృష్టించి..కేంద్రానికి ఒక తీర్మానం పంపాలని కూడా పక్కా స్కెచ్ సిద్ధం చేసుకున్నారు. గత నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ(డిసెంబరులో చేయాలని) పెద్ద ఎత్తున ఉన్నతాధికారులతోనూ సమాలోచనలు జరిపారు.
డిసెంబరు తొలి, రెండోవారం.. మూడో వారంలో సమావేశాలు ఉంటాయని.. తెలంగాణ మంత్రులు, నాయకులు కూడా చూచాయగా మీడియాకు లీకులు ఇచ్చారు. అయితే.. డిసెంబరు 23వ తేదీ దాటిపోయినా.. కేసీఆర్ నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు. అంటే.. సభ పెట్టేందుకు ఆయన ఎందుకో వెనక్కి తగ్గారనే భావన వ్యక్తమవుతోంది. దీనికి కారణాలు తెలియక పోయినా.. ప్రస్తుతం ఇది సరైన సమయం కాదని అనుకున్నారో.. లేక అసెంబ్లీ వేదికగా కన్నా.. జాతీయస్థాయిలో వేదికను ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి మోడీని, కేంద్రాన్ని దుమ్ముదులపాలని నిర్ణయించుకున్నారో తెలియదు కానీ.. కేసీఆర్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గారు.
ఇక, సభల విషయానికి వస్తే.. ఇక, ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఎలానూ ఫిబ్రవరి తొలి వారంలో కేంద్రం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తుంది. దీని తర్వాత.. ఏపీ, తెలంగాణ సహా.. దక్షిణాదిరాష్ట్రాలు.. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తారు. సో.. ఇక, అప్పుడే తాడో పేడో తేల్చుకునేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారనే వాదన వినిపిస్తోంది. అప్పుడైతే.. ఎలానూ కేంద్ర బడ్జెట్ వచ్చేస్తుంది. తెలంగాణకు ఏమిచ్చారు. దేశానికి(ప్రస్తుతం జాతీయ పార్టీ కదా) ఏమిచ్చారు..వంటి కీలక విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుని వాటిని కూడా ఒకే సారి రేవు పెడతారేమో చూడాలి.
This post was last modified on %s = human-readable time difference 9:39 pm
బహుశా నిఖిల్ కెరీర్ లోనే తక్కువ సౌండ్ తో వస్తున్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. నవంబర్ 8 విడుదలలో…
ప్రపంచంలో ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫారమ్గా ఉన్న వాట్సాప్ అనుచిత ఖాతాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, సెప్టెంబర్ నెలలో…
గత వైసీపీ హయాంలో జగన్ సాగించిన పాలన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు విషమ పరీక్షలు పెడుతోందనే భావన కూటమి…
ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే మొదటి ప్యాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1…
ఒక చిన్న పల్లెటూరు. దాని వెనుకో రహస్యాన్ని దాచుకున్న క్రైమ్. అది ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడు. ఊహించని ట్విస్టులతో…