ఏపీ సీఎం జగన్ తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సహా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై కలిపి ఆయన కామెంట్లు సంధించారు. ప్రస్తుతం కడప పర్యట నలో ఉన్న జగన్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఒకటి పోతే.. ఇంకొకటి ఆప్షన్ లేదని వ్యాఖ్యానించా రు. తాను ఏపీనే నమ్ముకుని ఉన్నానని చెప్పారు. ఏపీ ప్రజలతోనే తన రాజకీయాలు ఉంటాయన్నారు.
తనకు మరో రాష్ట్రం.. మరో రాజకీయం లేదని.. అవసరం రాదని కూడా వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాదిరిగా ఒక రాష్ట్రంపోతే.. మరో రాష్ట్రంలోనో.. ఒక పార్టీ పోతే.. మరో పార్టీ అనో(పొత్తులు) నేను అనడం లేదు. నాకు ఏపీ ఒక్కరాష్ట్రమే ఉంది. ఒక పార్టీనే ఉంది. ఒక్క రాష్ట్రప్రజలే ఉన్నారు. వారితోనే నా రాజకీ యం
అని జగన్ వ్యాఖ్యానించారు.
ఇక, ఇదేసమయంలో పవన్‌పైనా సటైర్లు వేశారు. చంద్రబాబుతో కలిసి ఉన్న దత్తపుత్రుడి మాదిరిగా ఒక భార్య పోతో ఇంకో భార్య అనో నేను అనడం లేదు. నాది ఒకే రాష్ట్రం.. ఒకే ప్రజలు.. ఒకేపార్టీ.. ఒకే రాజకీయం. ఇక్కడే నా నివాసం.. ఇక్కడే నా రాజకీయం.. ఇదే నా రాష్ట్రం
అని జగన్ స్పష్టంచేశారు.
This post was last modified on December 23, 2022 6:41 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…