ఒకవైపు వైసీపీ అధినేత, సీఎం జగన్ జన్మదిన వేడుకలు..మరోవైపు వైసీపీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, ఆధిపత్య ధోరణి తదితర అనేక అంశాలు రచ్చ రచ్చ సృష్టించాయి. హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ నేతలు ఎంత మంది కలివిడిగా ఉన్నారు.? ఎంత మంది దూరంగా ఉన్నారు? అనే విషయాలు ఈ వేడుకల సాక్షిగా బయటకు వచ్చాయి. నువ్వా నేనా అనే సంస్కృతికి పార్టీ కడు దూరమని.. అందరూ కలివిడిగా ఉంటారని ఒక పేరుంది.
అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం అంతర్గత కుమ్ములాటలకు వైసీపీ మాత్రం అతీతం కాదని నిరూపించినట్టు అయింది. శ్రీకాకుళంలో స్పీకర్, మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావులు ఎవరికి వారే కార్యక్రమాలు నిర్వహించి మమ అనిపించారు. విజయనగరంలో పార్టీ కీలక నాయకురాలుగా జగన్ కొన్ని రోజుల కిందటే పేర్కొన్న కిల్లి కృపారాణి నిర్వహించిన కార్యక్రమానికి మిగిలిన నాయకులు డుమ్మా కొట్టారు.
విజయవాడలో మల్లాది విష్ణు పాల్గొన్న కార్యక్రమానికి ఇతర నేతలు డుమ్మా కొట్టారు. ఇతర నేతల కార్యక్ర మాలకు మల్లాది కూడా గైర్హాజరయ్యారు. తిరుపతిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కీలకమైన మాచర్లలో అసలు సందడే కనిపించలేదు. ఇటీవలే ఇక్కడ టీడీపీ వర్సెస్ వైసీపీ వివాదం నడిచిన విషయం తెలిసిందే. అలాంటి చోట వైసీపీ అధినేత జన్మదిన వేడుకల ఊపు పెద్దగా కనిపించలేదు.
ఇక, హిందూపురంలో ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా ఇక్కడ మూడు వర్గాలు ముచ్చటగా.. పక్క పక్కనే పందిళ్లు వేసి మరీ కార్యక్రమాలు నిర్వహించాయి. కానీ, ఏంలాభం.. ఎమ్మెల్సీ ఇక్బాల్ కేంద్రంగా విమర్శలు.. వివాదాలతోనే సరిపోయింది. మొత్తంగా చూస్తే.. సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు.. నాయకుల బలాబలాలు నిరూపించుకునేందుకు, ఆధిపత్య ధోరణి ప్రదర్శించేందుకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.
This post was last modified on December 22, 2022 2:01 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…