Political News

ఇలా చేసి.. కేసీఆర్ స‌ర్ త‌ప్పు చేస్తున్నారా?!

“రాజ‌కీయంగా మ‌నం తిట్టుకుందాం.. కానీ, జీ20 వంటి కీల‌క స‌మ‌యంలో క‌లిసి ప‌నిచేద్దాం”- ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట ఇది!! ఆచ‌ర‌ణ‌లో ఇది సాధ్య‌మా కాదా.. అనేది ప‌క్క‌న పెడితే.. ఏ ఎండ‌కు ఆ గొడుగు పట్టార‌నే కామెంట్ అయితే వినిపించింది. ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని కూడా ఆయన దూరం చేసుకున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

ప్ర‌ధాని మోడీపై కేసీఆర్‌కు ఇప్పుడు పీక‌ల దాకా కోపం ఉన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌హ‌బూబాబాద్ లో జ‌రిగిన స‌భ‌లోనూ మోడీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే.. రాజ‌కీయాల్లో రెండు వైపులా ప‌దును ఉండాల‌నేది కేసీఆర్‌కు తెలియంది ఏమీకాదు. కానీ, ఆయ‌న ఒక‌వైపే చూస్తుండ‌డం ఫ్యూచ‌ర్ పాలిటిక్స్‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

త్వ‌ర‌లోనే టీఆర్ఎస్‌ను.. బీఆర్ఎస్ పార్టీగా మార్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసి నా.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేదు. అయినా.. స‌రే..వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి పార్టీని జాతీయ‌స్థాయిలో పుంజుకునేలా వ్యూహాత్మ‌కంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో రాణించాలంటే..కొన్ని కొన్ని విష‌యాల్లో కేసీఆర్ ప‌ట్టువిడుపులు ప్ర‌ద‌ర్శించాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జీ20 అనేది మోడీ వ్య‌క్తిగ‌త విష‌యం కాదు. దేశ‌వ్యాప్తంగా మేధావులు.. విద్యావేత్త‌లు, విద్యార్థులు.. సామా న్యుల‌కు కూడా సంబంధించిన విష‌యంగా మారింది. ఇలాంటి కీల‌క స‌మావేశానికి కేసీఆర్ హాజ‌రై.. త‌న దైన విజ‌న్‌ను ప్ర‌క‌టించి ఉంటే ఆ ఇమేజ్ వేరుగా ఉండేద‌ని అంటున్నారు. అదేస‌మ‌యంలో ఢిల్లీ, బెంగాల్‌, త‌మిళ‌నాడు.. ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు కూడా వ‌చ్చారు. వీరిని క‌లుసుకునే అవ‌కాశం ఉంది.

జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి పెడుతున్నార‌నే చ‌ర్చ‌ను మ‌రింత పెంచే ఛాన్స్ కూడా ఉంది. అయితే..కేసీఆర్ మాత్రం త‌న ప‌ట్టును కొన‌సాగించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల రేపు జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న ఎలా పుంజుకుంటార‌నేది ప్ర‌శ్న‌. మోడీకి బ‌ద్ధ శ‌త్రువుగా ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం వ‌చ్చారంటే.. జీ20 వేదిక‌ను మిస్ చేసుకుంటే ఇబ్బంద‌ని గుర్తించ‌బ‌ట్టే క‌దా! అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on December 7, 2022 2:21 pm

Share

Recent Posts

తెలుగులో లేట్ రిలీజ్ పర్లేదంటారా

బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…

2 hours ago

రవితేజ జాక్‌పాట్… ఇడియట్ డైలాగ్ పేలింది

వరుస ఫ్లాపుల కారణంగా గత కొన్నేళ్లలో మాస్ రాజా రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ బాగా దెబ్బ తిన్న మాట…

2 hours ago

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

4 hours ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

5 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

6 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

6 hours ago