టీడీపీ అధినేత చంద్రబాబు కోరుకున్నదే ఉభయ గోదావరి జిల్లాల్లోనూ జరుగుతోంది. కర్నూలులో ఆయన ఈ నెల మూడో వారంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. దీంతో ఆయన ఖుషీ అయ్యారు. ప్రజలు ఆయన కోసం గంటల తరబడి ఎదురు చూశారు కూడా ఇది ఆయనను మరింత మెప్పించింది. అసలు చంద్రబాబు పని అయిపోయిందని ఒకవైపు అధికార పార్టీ ప్రచారం చేస్తున్న సమయంలో ఆయనకు అనూహ్యంగా ప్రజలు బ్రహ్మరథం పట్టడం నిజంగానే ఆనందం కలిగిస్తోంది.
ఇక, ఇప్పుడు తాజాగా ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లోకి వెళ్లారు. రెండు రోజుల పాటు ఇక్కడ పర్యటించనున్నారు. ఈ సంద ర్భంగా చంద్రబాబు రాష్ట్రానికి ఇదేం ఖర్మ
కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే, కేవలం కార్యక్రమం ప్రారంభించేందుకు మాత్రమే ఆయన పర్యటన చేయడం లేదు. ఇక్కడ తన హవా ఎలా ఉంది? పార్టీ పరిస్థితి ఏంటి? ప్రభుత్వంపై ప్రజల ఆలోచనా విధానం ఎలా ఉంది.. అనే కీలక అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆయన జిల్లాల పర్యటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. అదేసమయంలో పార్టీప రిస్థితిని కూడా అంచ నా వేస్తున్నారు. తమ్ముళ్ల మధ్య విభేదాలు.. ఎవరు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎవరు పార్టీ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు? అనే విషయాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఇక, ఇప్పటి వరకు జరిగిన జిల్లాల పర్యటనలో కర్నూలు హైలెట్‌గా నిలిచింది. నందిగామ, నరసారావు పేటల్లో తమ్ముళ్ల మధ్య వివాదాలు విభేదాలు కనిపించినా, కర్నూలులో మాత్రం ఐక్యత కనిపించింది.
ఈ నేపథ్యంలోనే ఉభయ గోదావరులపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఈ రెండు జిల్లాలు కూడా టీడీపీకి కంచుకోటలు. గత ఎన్నికల్లో వైసీపీ హవా వీచినా.. ఈ రెండు జిల్లాల నుంచి నాయకులు గెలుపు గుర్రం ఎక్కారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఇక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ క్రమంలో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబుకు.. భారీ స్వాగతం లభించింది. వందల మంది పార్టీ కార్యకర్తలు వచ్చి.. ఆయనను అభినందనలతో ముంచెత్తారు. పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. దీంతో చంద్రబాబు ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.
This post was last modified on November 30, 2022 10:43 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…