ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మాతృమూర్తి వైఎస్ విజయమ్మను తెలంగాణ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే పోలీసులు ఆమెను అడ్డగించారు. ఈ క్రమంలో పోలీసులకు విజయమ్మకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. మంగళవారం ఉదయం వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. ప్రగతి భవన్‌వైపు తనే కారు నడుపుతూ వచ్చిన క్రమంలో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం షర్మిలను ఎస్ ఆర్. నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో తన కుమార్తెను పరా మర్శించి, మద్దతు తెలిపేందుకు ఆమె మాతృమూర్తి వైఎస్ విజయమ్మ కూడా ప్రత్యేక కారులో ఇంటి నుం చి బయలు దేరేందుకు సిద్ధమయ్యారు. అయితే, అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన విజయమ్మ ఇంటికి చేరుకుని ఆమెను అడ్డుకున్నారు. నేరుగా కారు వద్దకే వెళ్లి.. ఆమెను ఇంటి నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఈ సందర్భంగా కారు దిగిన విజయమ్మ కొద్ది దూరం పరిగెత్తే ప్రయత్నం చేసి.. పోలీసులను తప్పించుకో వాలని అనుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఎంతసేపటికీ కాలుకదపకుండా చేయడంతో విజయమ్మ ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. మేమూ ప్రభుత్వాలు నడిపాం. మాకు అన్నీ తెలుసు. పోలీసుల మొహం నేను చూడనట్టే వ్యవహరిస్తున్నారే
అంటూ విజయమ్మ వ్యాఖ్యానించారు.
తనను అడ్డుకుంటే అక్కడే కూర్చుని ఆందోళన చేస్తానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపి.. ధర్నాలు చేయమంటారా? నిరసనలకు పిలుపునివ్వమంటారా? రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వనా? మైకులు తెప్పించి మాట్లాడనా? అని ప్రశ్నించా
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…