ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు.. దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఈ మధ్య జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలోనే విరుచుకుపడుతున్నారు. ప్యాకేజీ అంటూ వాగితే చెప్పు తెగుతుంది అంటూ వైసీపీ నేతల్ని ఉద్దేశించి నెల కిందట తీవ్ర పదజాలంతో ఘాటైన వ్యాఖ్యలు చేసిన దగ్గర్నుంచి పవన్ ఫైర్ మామూలుగా ఉండట్లేదు. మంచి పాయింట్లు పట్టుకుని.. జగన్ సహా ముఖ్య నేతల తీరును తూర్పారబడుతున్నాడు పవన్.
తాజాగా పవన్.. జగన్ నవ్వు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జగన్ సమయం సందర్భం చూడకుండా నవ్వుతూ ఉంటాడనే విమర్శలు ఈ మధ్య బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకుని పవన్ కౌంటర్లు వేశాడు. ఎక్కడికి వెళ్లినా నవ్వు ముఖం పెట్టే జగన్‌ను అనుకరిస్తూ.. పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
“నవ్వులకు అస్సలు లోటుండదు సమయం సందర్భం లేకుండా నవ్వుతా ఉంటాడనుకో అది వేరే విషయం. నవ్వు నాలుగు విధాలుగా చేటన్నారు ఆయనకు తెలియదు ఆ సామెత. సందర్భం చూడకుండా అవతలి వాళ్లు ఏడుస్తున్నపుడు అలాగా అమ్మా బాగున్నారా. చచ్చిపోయారా అన్నట్లు నవ్వడం.. ఆస్తులు పోయినయా.. ఎంత పోయినయి.. పది కోట్లు పోయాయా. గడపలు కూల్చేశారా అన్నట్లు చూడడం” అంటూ పవన్ జగన్‌ను అనుకరించే ప్రయత్నం చేశారు.
ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణించిన నేపథ్యంలో అక్కడికి వెళ్లిన జగన్.. మహేష్ బాబు, ఇతర కృష్ణ కుటుంబీకులతో మాట్లాడుతున్నపుడు నవ్వు ముఖం పెట్టారు. గతంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లినపుడు, వేరే విచారకరమైన సందర్భాల్లో కూడా జగన్ ఎక్స్‌ప్రెషన్ అదే. సమయం సందర్భం లేకుండా జగన్ నవ్వుతాడంటూ ఆయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తుంటారు. పవన్ ఇదే పాయింట్ పట్టుకుండా జగన్‌కు కౌంటర్లు వేయగా. ఆయన ఆడియోను వాడుకుని జగన్ విషాదకర సందర్భాల్లో నవ్వు ఫేస్ పెట్టిన దృశ్యాలతో ట్రోల్ మెటీరియల్ రెడీ చేసి వైరల్ చేస్తున్నారు.
This post was last modified on November 28, 2022 1:50 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…