వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్రం నుంచి అనేక ఫ్యాక్టరీలు వైసీపీ ప్రభుత్వ దెబ్బతో పొరుగు రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఖరుకు కట్ డ్రాయర్‌లు తయారు చేసే జాకీ సంస్థ కూడా ఇక్కడి వైసీపీ నేతలకు లంచాలు, ముడుపులు ఇచ్చుకోలేక వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందని దుయ్యబట్టారు. ఇది మీకు సిగ్గని పించడం లేదా? అని సీఎం జగన్‌ను సూటిగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో మూడున్నర సంవత్సరాల కిందట అధికారం చేపట్టారు. ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీని కూడా తీసుకురాలేదు. నెల్లూరుకు వచ్చిన ఒక సంస్థ వెళ్లిపోయింది. విశాఖలో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు కూడా సుదూర దేశాల నుంచివచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనుకున్నవికూడా వెళ్లిపోయాయి. ఇదేనా మీ సంక్షేమ రాజ్యం. ఇలా అయితే, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి.? ఇక్కడి యువత నిరుద్యోగంతో మగ్గిపోవాల్సిందేనా?
అని పవన్ నిలదీశారు.
అహంకార ధోరణితో పాలిస్తున్నారన్న తన మాటలను వక్రీకరిస్తున్నారని, అహం కారం అంటే.. మేమే అధికారంలో ఉండాలి. మీరు మేం ఇస్తే తినేవాళ్లు.. మేం విసిరేసే ఎంగిలి మెతుకులు ఏరుకునేవారుగా మారడమేనని, ఇదే జనసేన వ్యతిరేకిస్తోందని పవన్ చెప్పారు. 30 సంవత్సరాలు.. అధికారంలోకి ఉండాలని మీరు అనుకుంటున్నారు. కానీ, అదే 30 సంవత్సరాల్లో యువత బాగుపడాలని, వారి జీవితాలు ఉజ్వలంగా ఉండాలని జనసేన కోరుకుంటోందని అన్నారు.
ఇదే.. వైసీపీకి, జనసేనకు మధ్య తేడా అని పవన్ చెప్పుకొచ్చారు. రెండుకళ్లు లేని ఒక వ్యక్తి మనకేదో కంప్లయింట్ ఇచ్చారని.. వారిని బెదిరించడం.. అహంకారం, సీమ ప్రాంతం నుంచి జనసేన సభకు వచ్చిన వారిని బెదిరించడమే అహంకారం.. కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వని పరిస్థితే అహంకారం. మీ ఉడత ఊపులకు జనసేన భయపడదు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ చెప్పారు. మాకు మద్దతుగా ఉన్న గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడితే.. 2024లో మేం అధికారంలోకి వచ్చిన తర్వాత.. అదే లీగల్ విధానం ద్వారా.. మీ ఎమ్మెల్యేలను అప్పటికి ఎక్స్ ఎమ్మెల్యేలు అయిపోతారు కదా.. వాళ్లను తరిమి తరిమి కొడతాం.. అని హెచ్చరించారు.
This post was last modified on November 27, 2022 3:11 pm
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…