Political News

బొత్స డ‌మ్మీ .. ఆయ‌న వ‌ల్ల ఏమీ కాదు: ప‌వ‌న్

ఏపీ సీనియ‌ర్ మినిస్ట‌ర్, విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి బొత్స డమ్మీ అయ్యార‌ని, ఆయ‌న వ‌ల్ల ఏమీ కావ‌ని, ఆయ‌న పై ఆశ‌లు కూడా పెట్టుకోవ‌ద్ద‌ని తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి ప‌వ‌న్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా తూర్పుకాపుల సమస్యలను అధిష్టానానికి చెప్పడం తప్ప చేసేదేమీ కనిపించడం లేదని పవన్ వ్యాఖ్యానించారు.

మంత్రి బొత్స పరిస్థితే అలా ఉంటే ఇక సాధార‌ణ వ్య‌క్తుల‌ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండని హితవు పలికారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. తూర్పుకాపుల పక్షాన జనసేన నిలబడుతుందని, జనసేనకు ఓటు వేయాలని ప‌వ‌న్‌ పిలుపునిచ్చారు. తూర్పు కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన కీల‌క నాయ‌కులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో శ‌నివారం పొద్దు పోయిన త‌ర్వాత మంగ‌ళ‌గిరిలో భేటీ అయిన ప‌వ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు.

సీఎం జ‌గ‌న్‌కు వార్నింగ్‌

నేను శ్రీకాకుళంలో పర్యటించలేదని, ఉద్దానం కిడ్నీ సమస్య గురించి నాకు తెలీదని ముఖ్యమంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆయన కోడి కత్తి డ్రామాలు ఆడుతున్నప్పుడు నేను ఉద్ధానంలోనే ఉన్నాను. ఆయనకు తెలియపోతే తెలుసుకుని మాట్లాడాలి. ఉద్దానం సమస్యను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేశాను. నేను వాళ్లలా తేనే పూసిన కత్తిని కాదు. తియ్యని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేయను అని ప‌వ‌న్ అన్నారు.

ఒక్క సినిమాను అవడానికి వాళ్లు మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించినప్పుడు, తూర్పు కాపులకు ఓబీసీ సర్టిఫికెట్ ఇవ్వడానికి మనం ఎందుకు యంత్రాంగాన్ని వాడకూడదని ప్ర‌శ్నించారు. అధికారాన్ని వాళ్లు దుర్వినియోగం చేస్తే మేం సద్వినియోగం చేస్తామ‌ని చెప్పారు. తూర్పుకాపుల సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతామ‌ని జనసేనాని భరోసా ఇచ్చారు.

This post was last modified on November 27, 2022 10:59 am

Share

Recent Posts

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

2 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

3 hours ago

100 కోట్ల ప్రయాణాల స్త్రీ శక్తి!

ఏపీలో కూట‌మి స‌ర్కారు అమ‌లు చేస్తున్న స్త్రీ శ‌క్తి ప‌థ‌కం రికార్డ్ సృష్టించింది. గ‌త ఏడాది ప్రారంభించిన ఈ ప‌థ‌కం…

5 hours ago

నక్సలైట్ అడవుల్లో నవ్వుల ‘కళ్యాణ్’

అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…

5 hours ago

సంచలనం… లెజెండరీ ఇండియన్ కెప్టెన్ గుడ్‌బై

ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…

7 hours ago

బాబు పవన్ భేటీ… స్థానిక ముడి పడినట్టేనా?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…

8 hours ago