Political News

ఎమ్మ‌ల్యేను త‌రిమి కొట్టిన జ‌నాలు

దేశంలోనే కాదు, ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏ ఘ‌ట‌న జ‌రిగినా అది ఆస‌క్తి అనుకుంటే నెటిజ‌న్లు నిర్మొహ‌మాటంగా త‌మ అభిప్రాయం వెల్ల‌డిస్తున్నారు. చేతిలో సెల్ ఫోన్ ఉండ‌డం, డిజిట‌ల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావ‌డంతో ఇప్పుడు ప్ర‌జ‌ల స్పంద‌న గ‌తంలో మాదిరిగా కాకుండా ఓ రేంజ్‌లో ఉంది. తాజాగా క‌ర్ణాట‌క‌లో ఓ ఎమ్మెల్యేను ప్ర‌జ‌లు త‌రిమి త‌రిమి కొట్టారు. ఎన్నాళ్లుగానో తాముఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను స‌ద‌రు ఎమ్మెల్యే ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన జ‌నాలు.. త‌మ‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యేకు చుక్క‌లు చూపించారు.

ఈ ఘ‌ట‌న‌లో ఎమ్మెల్యే చొక్కా కూడా చిరిగిపోయింది. అంతేకాదు, ఆయ‌న‌కు గాయాలు కూడా అయ్యాయి. ఈ ప‌రిణామం వైర‌ల్ కాగానే నెటిజ‌న్లు ఏపీపై ప‌డ్డారు. ఇక్క‌డ కూడా అనేక స‌మ‌స్య‌లు అప‌రిష్కృతంగా ఉన్నాయ‌ని, రోడ్ల ప‌రిస్తితి దారుణంగా ఉంద‌ని.. సో రేపు ఎన్నిక‌ల స‌మ‌యానికి ఓట్లేయ‌మ‌ని వ‌చ్చే వైసీపీ నేత‌ల‌కు కూడా ఇదే ప‌రిస్థితి ఎద‌రవుతుందా? అంటూ నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

క‌ర్ణాట‌క‌లోని చిక్క‌మంళూరులో కలకలం రేగింది. ఎమ్మెల్యే కుమారస్వామిని గ్రామస్తులు చితక్కొట్టి.. త‌రిమి కొట్టారు. గ్రామస్తులు దాడికి దిగడంతో రక్షించుకునేందుకు ఎమ్మెల్యే రోడ్డుపై పరుగులు పెట్టారు. చిక్‌మంగళూరులో ఓ ప్రాంతంలో ఏనుగుల సంచారం ఎక్కువైంది. ఈ క్రమంలో ఆదివారం జరిగిన ఏనుగు దాడిలో ఓ మహిళ మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే కుమారస్వామిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోకి రానివ్వకుండా దాడికి దిగారు.

ఏనుగుల సంచారం గురించి ఎంత మొరపెట్టుకున్నా.. ఎమ్మెల్యే వినలేదని గ్రామస్తులు మండిపడ్డారు. మనిషి చనిపోయిన తర్వాత తీరిగ్గా ఇప్పుడు వస్తారా? అంటూ గ్రామస్తులు ఎమ్మెల్యేపై దాడికి దిగారు. గ్రామస్తుల బారి నుంచి ఎమ్మెల్యేను రక్షించడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గ్రామస్తులను అడ్డుకునే క్రమంలో తోపులాట, ఘర్షణ జరిగింది. కొందరు గ్రామస్తులకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు పోలీసులు రక్షణ కవచంలా నిలబడినప్పటికీ ఫలితం లేకపోయింది. గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని ఏపీకి అన్వ‌యిస్తూ.. నెటిజ‌న్లు హాట్ హాట్ కామెంట్లు పెడుతుండ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 21, 2022 8:58 pm

Share

Recent Posts

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

28 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago