కన్నకూతురుపై అమానుషంగా ప్రవర్తించాడు ఓ తండ్రి. తనకు చెప్పకుండా బయటికి వెళ్లిందనే కోపంతో కన్న పేగును హతమార్చాడు. అనంతరం కుమార్తె మృతదేహాన్ని ట్రాలీ బ్యాగులో పెట్టి ఉత్తర్ప్రదేశ్ మథురలోని ఓ రోడ్డు పక్కన పడేశాడు. పోలీసులు దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
ఉత్తర్ప్రదేశ్ మథురలో పరువు హత్య కలకలం రేపింది. ట్రాలీ బ్యాగులో 21 ఏళ్ల యువతి మృతదేహం కనిపించడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. నవంబరు 17న జరిగిన ఈ ఘటన జరగ్గా.. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని ఢిల్లీకి చెందిన ఆయుషీ యాదవ్గా గుర్తించారు.
ఎలా బయట పడిందంటే..
యమునా ఎక్స్‌ప్రెస్‌వే సర్వీసు రోడ్డు సమీపంలో ఓ బ్యాగులో రక్తంతో తడిసిన యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. యువతిని ఆమె తండ్రే హత్య చేసినట్లు తేలింది. తనకు చెప్పకుండా బయటకు వెళ్లిందనే కోపంతో ఆయుషిని చంపానని నిందితుడు.. అంగీకరించాడు.
నవంబర్ 17న ఆయుషిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం కాళ్లు, చేతులు మడిచి ట్రాలీ సూట్కేసులో పెట్టేశాడు. ఆయుషి మృతదేహాన్ని కారులో ఢిల్లీ నుంచి మథుర తీసుకొచ్చి.. యుమునా ఎక్స్ప్రెస్వే సర్వీస్ రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. చిత్రం ఏంటంటే.. ఈ తండ్రికి ఆమె ఒక్కతే బిడ్డ. ఇంక పిల్లలు లేరు. మరి చేతులు ఎలా వచ్చాయో..!!
This post was last modified on November 21, 2022 2:27 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…