టీడీపీ అధినేత చంద్రబాబు ఏం మాట్లాడినా.. వెంటనే రియాక్ట్ అయ్యే వైసీపీ నాయకులు, పార్టీ అధిష్టానం.. కీలక నేతలు కూడా ఇటీవల కాలంలో లైట్ తీసుకుంటున్న విషయం తెలుసా? గతంలో చంద్రబాబు ఎక్కడ ఏం మాట్లాడినా.. వెంటనే వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యేవారు. కౌంటర్ ఎటాక్ చేసేవారు. కానీ, ఇటీవల కాలంలో మాత్రం ఎవరూ బాబు విషయంలో రియాక్ట్ కావడం లేదు. మరి ఎందుకు ఇలా.. వ్యూహం మారిపోయింది? ఇదీ.. ఇప్పుడు ఆసక్తికర చర్చ. వైసీపీ నేతలు.. కొన్నాళ్లుగా చంద్రబాబును పక్కన పెట్టేశారనే వాదన వినిపిస్తున్నా.. ఈ రేంజ్‌లో మాత్రం ఎప్పుడూ చర్చకు రాలేదు.
గతంలో చంద్రబాబు ఎక్కడ ఏ కామెంట్ చేసినా.. మంత్రులు, నాయకులు, ఫైర్ బ్రాండ్లు రియాక్ట్ అయ్యేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరూ కూడా పెద్దగా స్పందించడం లేదు. ఒకవేళ ఎవరైనా స్పందించినా ఎమ్మెల్యే స్థాయి నాయకులే రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే.. చంద్రబాబు కామెంట్లపై స్పందించడం ద్వారా.. ప్రతిపక్షం ఇంకా బలంగా ఉందనే సంకేతాలు పంపుతున్నట్టు అవుతుందని.. పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. కానీ, క్షేత్రస్థాయిలో మంత్రులు కానీ, నాయకులు కానీ, చంద్రబాబు పని అయిపోయిందని.. పార్టీ మళ్లీ ఓటమి ఖాయమని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అధిష్టానం.. టీడీపీ అధినేత విషయంలో రియాక్ట్ కావాల్సిన అవసరం లేదని నేతలకు దిశానిర్దేశం చేసినట్టు చెబుతున్నారు. మరి ఈ వ్యూహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పసిగట్టారో లేదో చూడాలి. అదేసమయంలో పవన్ విషయంలో మాత్రం మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. పవన్ ఎక్కడ ఏం మాట్లాడినా.. చిన్న ట్వీట్ చేసినా.. స్పందిస్తున్నారు. కౌంటర్లు ఇస్తున్నారు. నిజానికి చంద్రబాబుకు అయినా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ముగ్గురు ఎంపీలు ఉన్నారు. పవన్ విషయంలో మాత్రం అది కూడాలేదు.
అయినా.. పవన్ విషయంలో మాత్రం వైసీపీ నాయకులు రియాక్ట్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటి? అంటే.. వచ్చే ఎన్నికల్లో యూత్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. పవన్ వెనుక యువత ఉంటారనేది వాస్తవం. అందుకే .. వారి ఓట్లు అటు వైపు మళ్లకుండా చేసుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా పవన్‌కు కౌంటర్లు ఇస్తోందనే విశ్లేషణలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో యూత్ నమ్ముతారా? అనేది మరో ప్రశ్న. ఎందుకంటే.. పవన్ విషయంలో ఏం చేసినా.. ఏం మాట్లాడినా యూత్ నమ్మే పరిస్థితిలేదు. అయినప్పటికీ..వైసీపీ మాత్రం ఎదురుదాడిని అటు మళ్లించడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on November 16, 2022 12:16 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…