ఔను.. అంతా ఊకదంపుడే. ప్రధాని మోడీ తాజాగా విశాఖలో చేసిన ప్రసంగంలో ఎక్కడా ఒక్క ముక్క ఏపీ అభివృద్ధిని కాంక్షించేలా కనిపించలేదు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనే ఆయన ప్రసంగించారు. అంతకుమించి.. ఏపీని ఉద్దేశించి కీలకమైన అంశాలను పక్కన పెట్టేశారు. సో.. మొత్తానికి మోడీ పర్యటనలో ఆయన ప్రసంగంలో ఎక్కడా.. ఏపీ ప్రజల మనోభావాలు కనిపించకపోవడం గమనార్హం.
ప్రసంగంలో మోడీ పాఠం ఇదే!
ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ప్రజలు రాణిస్తున్నారన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మోడీ.. తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. కొన్ని నెలల కిందట అల్లూరి జయంతి వేడుకలకు వచ్చే సౌభాగ్యం కలిగిందని తెలిపారు.
భారత్‌కు విశాఖపట్టణం ప్రత్యేకమైన నగరమని ప్రధాని అభివర్ణించారు. ప్రాచీనకాలం నుంచి విశాఖ పోర్టుకు ఘన చరిత్ర ఉందన్న మోడీ.. ఎన్నో ఏళ్లుగా ప్రముఖ వ్యాపార కేంద్రంగా విరాజిల్లుతోందని వ్యాఖ్యానించారు. వెయ్యేళ్ల క్రితమే పశ్చిమాసియా, రోమ్‌కు విశాఖ నుంచి వ్యాపారం జరిగేదని తెలిపారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరిబాబు ఎప్పుడు తనని కలిసినా ఏపీ అభివృద్ధిపైనే అడుగుతారని తెలిపారు.
వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారు. విశాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నాం. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు. మిషన్ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచాం.. అని మోడీ అన్నారు.
సమ్మిళిత అభివృద్ధే తమ ఆలోచన అని ప్రధాని తెలిపారు. మౌలిక సదుపాయాలతో ఆధునిక భారత్‌ను ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. రైల్వే, రోడ్లు, పోర్టుల అభివృద్ధిలో తాము ఎప్పుడూ సందేహించలేదని తెలిపారు. శాఖ రైల్వేస్టేషన్‌తో పాటు పోర్టును ఆధునీకరిస్తున్నామన్నారు. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ ముందడుగు వేస్తోందని వ్యాఖ్యానించారు. మిషన్ గతిశక్తి కింద ప్రాజెక్టుల్లో వేగం పెంచామని పేర్కొన్నారు.
ఇవాళ ప్రతి దేశం ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సంక్షోభంలో ఉన్న ప్రతి దేశం నేడు భారత్ వైపు చూస్తోంది. వెనుకబడిన జిల్లాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నాం. పీఎం కిసాన్ ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు వేస్తున్నాం. పేదలకు మరిన్ని పథకాలు విస్తరిస్తున్నాం. మత్స్యకారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉపయోగపడుతున్నాయి.. అని మోడీ చెప్పారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ, అభివృద్ధికి అడుగులు వేస్తున్నట్లు తెలిపారు.
This post was last modified on November 13, 2022 10:34 am
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…
ఏపీలో కూటమి సర్కారు అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం రికార్డ్ సృష్టించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం…
అనుకోని అదృష్టం తలుపు తట్టి ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కామ్రేడ్ కళ్యాణ్ కు భలే కలిసి…
ఇండియన్ క్రికెట్లో ఒక శకం ముగిసింది. లెజెండరీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నాయకత్వానికి వీడ్కోలు పలికింది. 37 ఏళ్ల హర్మన్ ప్రీత్…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో కూటమి నేతలు ఎన్నికల వ్యూహంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో…
ఒక జాతీయ సెలవు దినం రోజు ఎనిమిది సినిమాలు విడుదలైతే ఆ వీకెండ్ మొత్తం థియేటర్లు కళకళలాడిపోవాలి. వాటిలో సగం…