సీఎం జగన్ పై ఫిర్యాదుల పరంపర

విశాఖకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బీజేపీ కోర్ కమిటీ భేటీలో పాల్గొనటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన దాదాపు తొంభై నిమిషాల పాటు పార్టీ నేతలతో భేటీ కావటమే కాదు.. ఈ సందర్భంగా వారి మధ్య పలు అంశాలపై చర్చతో పాటు.. ఏపీసర్కారు మీదా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదా కంప్లైంట్లు చేసిన వైనం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ బీజేపీ నేతల్లో ముగ్గురు నేతలు కీలక భూమిక పోషించినట్లుగా చెబుతున్నారు.

జగన్ ప్రభుత్వ వైఫల్యాలు.. జగన్ సర్కారు చేస్తున్న తప్పులతో పాటు.. రాష్ట్రంలో నెలకొన్ని దారుణ పరిస్థితులతో పాటు.. విశాఖపట్నంలో పెరిగిన భూకబ్జాల అంశం ప్రధాని నరేంద్ర మోడీ భేటీలో కీలక చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. భేటీ సందర్భంగా ప్రధాని మోడీకి.. సీఎం జగన్ కు మధ్యనున్న సన్నిహిత సంబంధాల గురించిన విషయాలు చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

జగన్ సర్కారుకు కేంద్రం ఆశీస్సులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుందన్న మాటకు ప్రధాని మోడీ రియాక్టు కావటమే కాదు.. స్పష్టమైన సమాదానం చెప్పినట్లుగా తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వానికి మోడీ సర్కారు మద్దతు ఉంటుందన్న విషయాన్ని ఏపీ ప్రజలు నమ్ముతున్నారని చెప్పొచ్చు. కానీ.. అందులో నిజం లేదన్న మోడీ.. సమాఖ్య స్ఫూర్తికి మాత్రమే కట్టుబడి ఉన్నా. అంతకుమించి ఎవరిపైనా ప్రత్యేక ప్రేమను చూపను. వాళ్ల చెప్పేది చెబుతారు.

మీరు చేయాల్సింది మీరు చేయండి. ప్రభుత్వం.. ప్రభుత్వమే. రాజకీయం రాజకీయమే.. అని క్లారిటీగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక.. మోడీతో భేటీ సందర్భంగా ఏపీ సర్కారుపైనా.. సీఎం జగన్ మీద పలు విషయాల్ని చర్చకు తెచ్చిన వారిలో బీజేపీ నేతలు సుజనా చౌదరి.. సీఎం రమేశ్ లతో పాటు ఎమ్మెల్సీ మాధవ్ లు ఉన్నట్లుగా చెబుతున్నారు. నిత్యం మీడియాలో ఫైర్ అయ్యే పలువురు బీజేపీ నేతలు కామ్ గా ఉన్నారే కానీ పెద్దగా మాట్లాడింది లేదన్న మాట వినిపిస్తోంది.