ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే.. టీడీపీకి కంచుకోట. ఇక్కడ అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అనేక మంది మాజీ మంత్రులు కూడా ఉన్నారు. ఒకప్పుడు జిల్లాను శాసించిన నేతలు కూడా ఇప్పుడు అనంతపురంలోనే ఉన్నారు. అయితే, ఇప్పుడు వారివల్ల ఏం ప్రయోజనం అనే మాట వినిపిస్తోంది. తాజాగా కళ్యాణ దుర్గంలో తమ్ముళ్లు కొట్టుకున్నారు. ఆధిపత్య రాజకీయాలు.. మా మాటే నెగ్గాలనే పంతాలు వంటివి ఇక్కడ టీడీపీని బజారున పడేస్తున్నాయి.
ప్రతి నియోజకవర్గంలోనూ ఏదో ఒక చిచ్చు కనిపిస్తూనే ఉంది. పైకి మాత్రం అందరూ కలిసి ఉన్నట్టుగా.. అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం టీడీపీలో అనేక విభేదాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి కళ్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సొంత పార్టీలోనే ఆమెను వ్యతిరేకించే వర్గం ఇటీవల రోడ్డున పడితీవ్ర విమర్శలు చేసింది. ఇలాంటి సమయంలో ఈ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించాలి.
కానీ, మండలస్థాయి పదవుల కోసం.. కొట్టుకోవడం రోడ్డున పడడం వంటివి పార్టీని మరింత బలహీనపరిచేలా ఉన్నాయి. ఇక, ధర్మవరంలో సీటు ఇస్తారో లేదో కూడా తెలియదు. కానీ, ఇక్కడ పరిటాల శ్రీరాం మకాం వేశారు. నిజానికి గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ ఓడిపోయారు. అయితే, వచ్చే ఎన్నికల్లో అదీ ఇదీ రెండూ కావాలని పట్టుబడుతున్నారు. పోనీ.. రాప్తాడులో అయినా.. చక్రం తిప్పుతున్నారా? అంటే.. దానిపై మితిమీరిన విశ్వాసంతో అసలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.
మరోవైపు.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులతో విభేదిస్తున్న నాయకులు పెరిగిపోతున్నారు. జేసీ వర్గం.. ప్రత్యేకంగా రాజకీయాలు చేస్తోంది. తమదే పైచేయి అన్నట్టుగా.. నాలుగు నియోజకవర్గాలను శాసిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక కీలక నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి ఎస్సీ నాయకుడిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వీటిపై అంతర్గతంగా తమ్ముళ్లు చర్యలు కోరుతున్నా.. చంద్రబాబు మౌనంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఆయన వాయిస్ కూడా తగ్గిపోయి.. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైందనే చెప్పాలి.
This post was last modified on November 10, 2022 3:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…