Political News

జనసేన మీటింగ్‌కు స్థలం ఇచ్చారని..

రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అవతలి పార్టీ వాళ్లను అధికార పార్టీ, ప్రభుత్వం టార్గెట్ చేయడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వం మారినపుడు కొన్ని రోజులు ఇలాంటి వాటి మీద దృష్టిపెట్టి.. ఆ తర్వాత పరిపాలన మీద దృష్టిసారిస్తుంటాయి ప్రభుత్వాలు. కానీ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష పార్టీలను, తమకు కంటగింపుగా మారిన వారిని వేధించడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే చూస్తున్నాం.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తిన వారిని.. అలాగే ప్రతిపక్షాలకు సహకరించిన వారిని టార్గెట్ చేసి ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం, వారికి నష్టం చేకూర్చడం చేస్తోంది జగన్ సర్కారు. ఈ క్రమంలో సామాన్య ప్రజలను కూడా వదలట్లేదు.

కొన్ని నెలల కిందట జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం కోసం అనుమతులు అడిగితే జగన్ సర్కారు ఆ పార్టీ నేతల్ని ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే. ప్రభుత్వ స్థలాలను ఇందుకోసం కేటాయించడానికి ససేమిరా అంది. చివరికి ఈ మీటింగ్ కోసం మంగళగిరి ప్రాంత రైతులు ముందుకు వచ్చారు. తమ స్థలాన్ని జనసేన మీటింగ్ కోసం ఇచ్చారు. ప్రైవేటు స్థలంలో ప్లీనరీ మీటింగ్ జరుపుకున్నప్పటికీ రకరకాలుగా జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి పోలీసులు ప్రయత్నించడం తెలిసిందే. కట్ చేస్తే ఇప్పుడు తమ అభీష్టానికి వ్యతిరేకంగా జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన రైతులను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది.

మంళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో జనసేన ప్లీనరీకి స్థలం ఇచ్చిన వాళ్ల ఇళ్లను జేసీబీలతో కూల్చేస్తుండడం గమనార్హం. సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామాన్య జనం మీద కూడా ఈ స్థాయిలో కక్ష సాధింపులకు పాల్పడే ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.

This post was last modified on November 4, 2022 9:52 pm

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

53 minutes ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

2 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

13 hours ago