విజయవాడ ఎంపీ టికెట్ అంటే ప్రస్తుతం ఒక హాట్ సీట్ లెక్క. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉన్నా విజయవాడ లెక్కవేరే అంటున్నారు వైసీపీ నాయకు లు. దీనిని ఇప్పటి వరకు ఎవరికీ కేటాయించలేదు. గత ఎన్నికల్లో ప్రముఖ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత ఆయన ఎక్కడా కనిపించడం లేదు. కొన్నాళ్లు ప్రభుత్వకార్యక్రమాల్లో హల్చల్ చేసినా తర్వాత ఆయన వ్యాపారాలు, వ్యవహారా్ల్లోనే ఉంటున్నారు. దీంతో ఈ సీటును ఆయనకే కేటాయిస్తారా? లేక ఎవరికైనా ఇస్తారా? అనే చర్చజరుగుతోంది. అయితే, దీనిపై వైసీపీ అధిష్టానం మౌనంగా ఉంది.
దీనికి కారణం ఏంటనేది ఇంకా తెలియక పోయినా ఒక విషయం చర్చకు వస్తోంది. రాజకీయంగా ఉన్న వ్యూహాల నేపథ్యంలో ఈ టికెట్‌ను వదులుకు నేందుకు వైసీపీ సిద్ధపడుతోందనే చర్చ సాగుతోంది. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉన్నా నిజమన్నట్టుగా వైసీపీలోనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నిక ల నాటికి ఈ టికెట్‌నుంచి బీజేపీ పోటీ చేస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న ఎంపీ కేశినేని నానికి కనుక టీడీపీలో టికెట్ దక్కకపోతే ఆయన వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నారని కొన్నాళ్లుగా విజయవాడలో చర్చసాగుతోంది.
అయితే, దీనిపై ఇంకా క్లారిటీ లేకపోయినా, రాజకీయంగా ఆయన తమ్ముడు పుంజుకోవడం, టీడీపీ నేతలు ఆయనకు జైజేలు కొట్టడం వంటివి ఇక్కడ హాట్ పుట్టిస్తున్నాయి. దీంతో ఏదైనా జరగొచ్చు అనే చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు బీజేపీ కనుక ఇక్కడ నుంచి పోటీ చేస్తే.. దీనిని శాక్రిఫైజ్ చేసేందుకు వైసీపీ రెడీగా ఉందని చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందని కూడా కొందరు సీనియర్లే అంటున్నారు. సో.. ఎలా చూసుకున్నా రాజకీయంగా విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
మరోవైపు, కేశినేని నాని వైఖరితో విసిగిపోయిన టీడీపీ ఆయనను తప్పించి మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కుటుంబానికి ఈ సీటు ఇచ్చేందుకు చూస్తోందనే ప్రచారం కూడా సాగుతోంది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, కేశినేనిని గుంటూరుకు పంపిస్తారని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా రాజకీయంగా విజయవాడ ఎంపీ హాట్ టాపిక్ అయింది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 2, 2022 7:10 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…