జనసేన పార్టీని పూర్తిస్థాయిలో పుంజుకునేలా చేయాలనేది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యూహం. ఇదే విషయాన్నితాజాగా ఆయన వెల్లడించారు. పార్టీని అన్ని రూపాల్లోనూ విస్తరిస్తామన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో పవన్ ఇవే వ్యాఖ్యలుచేశారు. అయితే.. పార్టీని బలోపేతం చేయాలంటే.. కొత్తవారిని తీసుకుని తీరాలి. ఈ విషయం ఎప్పటి నుంచో చర్చకు వస్తున్నదే. గత ఏడాది కూడా ఇదే విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే, ఎప్పటికప్పుడు సంకల్పం చెప్పుకోవడమే తప్ప.. దానిని అమలు చేయలేదు. ఈ నియామకాలు ఏడాది కిందటే జరిగి ఉంటే.. పార్టీ ఇప్పటికే ప్రజల్లోకివెళ్లి ఉండేదనే చర్చ ఉంది.
అయితే, పవన్ మాత్రం ఎప్పటికప్పుడు.. దీనిని ప్రకటించడం తర్వాత మరిచిపోవడం షరా మామూలే అన్నట్టుగా ఉంది. పోనీ.. ఇప్పటికైనా అనుకున్న విషయాన్ని ఆచరణలో పెడతారేమో చూడాలి. ఇలా చూసినా.. కనీసం 70 మంది వరకు కొత్తనేతలను తయారు చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇప్పుడున్న వారిని గమనిస్తే.. పట్టుమని 50 నుంచి 60 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వీరివల్ల పార్టీ పుంజుకునే పరిస్థితి ఉందా లేదా అనే విషయాలను పక్కన పెడితే.. మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీని పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉంది. దీనికి కొత్తవారిని తీసుకోక తప్పదు. ఎంత పొత్తు పెట్టుకున్నా.. పార్టీ తరఫున ప్రచారం చేసేందుకు అయినా నాయకులు అవసరం
ఇప్పటికిప్పుడు మార్పు చేర్పులు చేపడితే తప్ప.. ఏడాదికి పార్టీ పుంజుకునే పరిస్థితి లేదన్నది పార్టీలోనే జరుగుతున్న చర్చ. మరోవైపు.. ఉన్న నాయకులు కూడా సరిగా పనిచేయడం లేదని పవన్ చెబుతున్నారు. తాజా సమావేశంలోనే ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. జనసేనకు ఇంచార్జులుగా 40 మంది ఉన్నారు. వారిలో పోతుల మహేష్ వంటి ఒకరిద్దరు తప్ప.. ఎవరూ కూడా కౌంటర్ ఇవ్వడం లేదు. ప్రభుత్వ పక్షం నుంచి వచ్చే విమర్శలకు కానీ, ఉద్యమాల్లో పార్టిసిపేషన్ కానీ.. చాలా చాలా తక్కువగా ఉంటోంది. పవన్ వస్తే మాత్రమే హడావుడి చేస్తున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. ఆయన అటు విమానం ఎక్కగానే ఇటు.. వీరంతా సర్దు కుంటున్నారు.
ఈ పరిస్థితిని కూడా పవన్ ప్రస్తావించారు. ఇలా అయితే కష్టమని హెచ్చరించారు. మరి వారు ఏమేరకు మారతారో చూడాలి. ఇంకోవైపు సామాజిక వర్గాల వారిగా కూడా జనాలను పార్టీవైపు ఆకర్షించాలని నిర్ణయించారు. ఇది కూడా అత్యంత కీలకమే. ఎందుకంటే.. తనకు కులం లేదని.. తను కులం చూడడని చెబుతున్నా.. ఇతర పార్టీలు, ఏపీ రాజకీయాలు మాత్రం అలా లేవు. దీంతో జనసేన కూడా వారితో సమాంతరంగా నడవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జనసేన వేసే ప్రతి అడుగు కీలకంగా మారింది.దీనికి కొత్తవారు.. ఏమేరకు సహకరిస్తారో చూడాలి.
This post was last modified on November 2, 2022 11:00 am
మెల్లగా గేమ్ ఛేంజర్ గేరు మారుస్తోంది. ఇప్పటికే మూడు పాటలు, ఒక టీజర్ వచ్చాయి. ఎల్లుండి జరగబోయే యుఎస్ ప్రీ…
ఏపీ ఫైబర్ నెట్ సంస్థపై వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక అవకతవకల గురించి ఆ సంస్థ చైర్మన్ జీవీ…
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…