గడిచిన కొద్ది నెలలుగా కరోనా కారణంగా అతలాతకులమైపోతున్న వేళ.. చాలా పనులకు ఇబ్బందికరంగా మారింది. ఇంట్లోనే ఉండాల్సి రావటం.. బయటకు వస్తే వైరస్ ముప్పును ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో పలు వ్యవస్థలు పని చేయలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే దిశగా పలు రంగాలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా అలాంటి నిర్ణయమే ఒకటి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనా ప్రబలిన నేపథ్యంలో అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకోవాలన్న సూచనను సుప్రీం చేసింది. కోర్టు సమన్లు.. నోటీసులు.. ఈ మొయిళ్లు.. ఫ్యాక్స్ తదితరాలను వాట్సాప్ ద్వారా కూడా పంపొచ్చని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ. బోబ్డే.. జస్టిస్ ఆర్.సుబాషణ్ రెడ్డి.. జస్టిస్ ఎ.ఎస్. బోపన్నలతో కూడిన ధర్మాసనం తాజా ఆదేశాల్ని జారీ చేసింది. కరోనా వేళ.. కక్షిదారులు.. న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి చిక్కుల్ని తప్పించేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందించటం ద్వారా.. చాలా సమస్యలకు పరిష్కారంగా మారుతుందని భావిస్తున్నారు.
కరోనానేపథ్యంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల అంశాన్ని సుమోటోగా విచారించిన సుప్రీం ధర్మాసనం.. తాజాగా వాట్సాప్ ద్వారాసమాచారాన్ని.. నోటీసుల్నిపంపొచ్చన్న నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. కేసులవిచారణలో జాప్యాన్ని తగ్గించే వీలుంటుందని చెబుతున్నారు.
This post was last modified on July 11, 2020 11:51 am
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…