Political News

ప‌వ‌న్ మీటింగ్‌లో మిస్స‌యిన వీడియో చూశారా?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా మంగ‌ళ‌వారం.. త‌న పార్టీ కేంద్ర కార్యాల‌యం మంగ‌ళ‌గిరిలో మాట్లాడుతూ.. వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. కొడ‌క‌ల్లా.. చెప్పుతోకొడ‌తా.. అంటూ.. రెచ్చిపోయారు. మ‌రిన్ని కామెంట్లు కూడా చేశారు. ఇక‌, యుద్ధ‌మే అంటూ.. వైసీపీ నాయ‌కుల‌ను ఆయ‌న హెచ్చ‌రించారు. అయితే.. దీనిపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. కౌంట‌ర్లు ఇచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. ఒక పార్టీ అధ్య‌క్షుడు మాట్లాడేతీరు ఇదే.. నువ్వు నీ కార్య‌క‌ర్త‌ల‌కు ఏం నేర్పిస్తున్నావ్‌? అని ప్ర‌శ్నించారు.

కుర‌సాల క‌న్న‌బాబు నుంచి మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వ‌ర‌కు అందరూ ప‌వ‌న్‌ను త‌ప్పుబ‌ట్టారు. పీకే.. అంటే.. పిచ్చి.. కొడుకు అంటూ.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌.. ప‌వ‌న్‌ను ఎవ‌రైనా గ్యాంగ్ రేప్ చేశారా అంటూ.. అమ‌ర్నాథ్ రెచ్చిపోయి కామెంట్లు చేశారు. భావి త‌రానికి నువ్వు ఇచ్చే సందేశం ఇదేనా? యువ‌త నిన్ను న‌మ్ముకుంటే.. బూతులు నేర్చుకోవ‌డం త‌ప్ప‌.. రాజ‌కీయాలు నేర్చుకోలేవ‌ని.. వ్యాఖ్యానించారు. అయితే.. వాస్త‌వానికి.. ప‌వ‌న్ త‌న స‌మావేశంలో వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ‌డానికి ముందు ఒక వీడియోను ప్లే చేశారు.

ఈ వీడియోలో గ‌తంలో వైసీపీ మంత్రిగా ఉన్న ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌.. లం.. కొడుకులు అని రెచ్చిపోవడం.. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి చంద్ర‌బాబుపై.. తీవ్ర వ్యాఖ్య‌లు చేయ‌డం.. మంత్రి రోజాగతంలో అధికారుల‌ను దూషించ‌డం.. ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తిపక్షంలో ఉన్న‌ప్పుడు.. నంద్యాల ఉప ఎన్నిక‌లో చంద్ర‌బాబును ఉరితీసినా త‌ప్పులేద‌ని వ్యాఖ్యానించ‌డం.. వంటివి ప్లే చేశారు. అదేస‌మ‌యంలో టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులు.. కూడా చూపించారు.

ఇక‌, ప‌ల్నాడు ప్రాంతంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో అప్ప‌టి టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న ల‌క్ష్యంగా చేసిన దాడులు.. కార్లు ధ్వంసం చేయ‌డం.. జ‌న‌సేన కార్యాల‌యంపై దాడి.. పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను.. వైసీపీ ఎమ్మెల్యే దూషించ‌డం వంటివి కూడా.. స్ప‌ష్టంగా చూపించారు. అనంత‌ర‌మే వ‌ప‌న్‌.. వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఇంత జ‌రిగినా.. అంటే.. దాదాపు 20 నిమిషాల సేపు ఈ వీడియోను ప్లే చేసి.. త‌ను చూసి.. త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు చూపించినా.. ఏ మీడియా ఛానెల్‌లోనూ.. ఇది రాలేదు. క‌నీసం ఒక్క వార్త కూడా బ‌య‌ట‌కు రాలేదు. మ‌రి దీని వెనుక ఏంజ‌రిగింద‌నేది ఇప్పుడు జ‌న‌సేన నేత‌ల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. దీనిని భ‌వ‌దీయుడు భ‌గ‌త్‌సింగ్‌ పేరిట ఉన్న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది.

This post was last modified on October 20, 2022 8:12 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

32 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago