ఉత్తరాంధ్రలో కీలకమైన విశాఖపట్నం స్టీలు ప్లాంటును ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పవన్ ఖండించారు. ఈ క్రమంలో అక్కడ స్టీల్ ప్లాంటు కోసం.. ఉద్యమిస్తున్న ఉద్యోగులకు తాను అండగా ఉంటానని పవన్ చెప్పారు. అయితే.. ఈ ఉద్యమంలో ఉన్నవారు చిత్తశుద్ధితో ఉన్నారా? అని పవన్ ప్రశ్నించారు. చిత్తశుద్ధితో ఉన్నానని హామీ ఇస్తే..ఉద్యోగులకు అండగా ఉంటానని పవన్ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర గురించి.. మాట్లాడే వైసీపీ నాయకులకు.. ఉత్తరాంధ్ర గురించి ఏం తెలుసునని.. పవన్ ప్రశ్నించారు.
మంగళవారం.. ఆయన పార్టీ కార్యకర్తలను, నేతలను ఉద్దేశించి మంగళగిరిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉన్నాయని.. వాటిని వదిలేసి.. లేనిపోని సమస్యలు తెరమీదికి తెస్తున్నారని అన్నారు. అంతేకాదు.. జిందాల్ వంటి సంస్థలు అక్కడకు వస్తున్న ప్రభుత్వం తరఫున గనుల సంస్థలను ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. ‘అవంతి.. బంతి..’ అంటూ.. వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఉత్తరాంధ్ర చరిత్రలో స్టీల్ ప్లాంట్ కోసం.. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారని.. అలాంటి పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే.. ప్రస్తుత ప్రబుత్వం చూస్తూ.. నీళ్లు నములుతోందని.. అదేమంటే.. కేంద్రానికి లేఖలు రాశామని.. చెబుతోందని.. లేఖలు రాస్తే.. పనులు జరుగుతాయంటే.. పాలన కోసం.. సీఎంను ఎన్నుకోవడం.. ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంటును పరిరక్షించేందుకు .. అక్కడ ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా గర్జన చేస్తే.. తాను కూడా పాదం కదిపేవాడినని.. కానీ, లేని పోని ప్రాంతీయ భావం పెంచేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. స్టీలు ప్లాంటు ఉద్యోగులకు జనసేన ఎప్పటికీ అండగా ఉంటుందని పవన్ స్ఫష్టం చేశారు.
This post was last modified on October 18, 2022 2:29 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…